Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారా...?

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:30 PM
అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారా...?
X
కరోనా కారణంగా థియేటర్స్ మూతబడి పోవడంతో విడుదలకు నోచుకోని చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. తెలుగులో కూడా క్రేజీ మూవీస్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధపడుతున్నారు. అయితే లాక్ డౌన్ విధించక ముందే షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాల‌కి బిజినెస్ మొద‌లైపోయిందని తెలుస్తోంది. వీటి కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ అడ్వాన్సులు కూడా ఇచ్చేసారట. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. రిలీజ్ వేదికపై క్లారిటీ లేని సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ కోసం అడ్వాన్సులు క‌ట్టిన పంపిణీదారులు, ఎగ్జీబిట్ల‌ర్స్ ఇప్పుడు డ‌బ్బులు వెనక్కి ఇవ్వమని నిర్మాత‌ల పై ఒత్తిడి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతుంటారు. అయితే అలాంటి ప‌రిస్థితులు ఇప్పుడు క‌నిపించ‌డం లేదని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ విష‌యంపై త్వరలోనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిసైడ్ అయినట్లుగా సమాచారం.

వాస్తవానికి కరోనా కారణంగా ఆరున్నర నెలల నుండి థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో ప్రొడ్యూసర్స్ తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్స్ తెచ్చిన మొత్తానికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో వీటి నుంచి బయటపడటానికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మరో మార్గంగా కనిపించాయి. అయితే థియేటర్స్ రీ ఓపెన్ చేయాలని ఎగ్జీబిట్ల‌ర్స్ థియేటర్స్ ఓనర్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మళ్ళీ ఎప్పటిలాగే ప్రొడ్యూసర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సంబంధాలు కొనసాగుతాయని సినీ పెద్దలు చెబుతున్నారు.