Begin typing your search above and press return to search.

చిరు సినిమా కోసం డిస్ట్రిబ్యూట‌ర్ల కండీష‌న్స్‌?

By:  Tupaki Desk   |   15 Nov 2022 3:30 PM GMT
చిరు సినిమా కోసం డిస్ట్రిబ్యూట‌ర్ల కండీష‌న్స్‌?
X
వ‌చ్చే ఏడాది సంక్రాంతి సీజ‌న్ క్రేజీ సినిమాల‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతోంది. గ‌త కొన్నేళ్ల‌లో ఎప్పుడూ సంక్రాంతి బ‌రిలో పోటీప‌డ‌ని మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ పోటీప‌డ‌బోతున్నారు. `గాడ్ ఫాద‌ర్‌` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీల్తేరు వీర‌య్య‌`. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక ఇదే నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాల‌య్య‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. దునియా విజ‌య్ న‌టిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో బాల‌య్య న‌టిస్తున్నఈ మూవీతో చిరుకు పోటీగా సంక్రాంతి బ‌రిలో దిగుతున్నారు.

దీంతో ఈ సంక్రాంతి స‌మ‌రం ర‌సవ‌త్త‌రంగా మార‌బోతోంది. విచిత్రం ఏంటంటే ఈ రెండు క్రేజీ సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే నిర్మిస్తున్నారు. అత్యంత భారీ స్టాయిలో నిర్మిస్తున్న ఈ మూవీస్ సంక్రాంతి బ‌రిలో పోటీప‌డ‌టం ఇష్టం లేక‌పోయినా బాల‌య్య కార‌ణంగా ఈ పోటీకి సై అనేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు మూవీస్ ని ప్ర‌తీ ఏరియాలోనూ ఒకే డిస్ట్రిబ్యూట‌ర్ కి ఇచ్చేస్తున్నార‌ట‌. అయితే కొంత మంది డిస్ట్రిబ్యూట‌ర్లు మాత్రం చిరు సినిమాకు కండీష‌న్స్ పెడుతున్న‌ట్టుగా తెలుస్తోంది.  

నైజాం ఏరియాలో రెండు సినిమాల రైట్స్ కి 35 కోట్లు విలువ క‌ట్టార‌ట‌. ఇక సీడెడ్ కు వ‌చ్చేస‌రికి రూ. 24 కోట్లు చెబుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలోనే సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్లు చిరు సినిమాకు కండీష‌న్ లు పెడుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. `గాడ్ ఫాద‌ర్‌` రిజ‌ల్ట్ ని సాకుగా చూపించి త‌క్కువ రేట్ల‌కు అడుతున్నార‌ట‌. అదే స‌మ‌యంలో బాల‌య్య సినిమాకు ఎక్కువైనా పెడతామ‌ని, చిరు సినిమాని మాత్రం త‌క్కువ రేట్ల‌కి ఇమ్మంటున్నార‌ట‌.

చిరు `గాడ్ ఫాద‌ర్` సీడెడ్‌లో ఎనిమిది కోట్లు రాబ‌ట్ట‌లేక‌పోయింద‌ట‌. దీంతో అంత పెట్ట‌డానికి తాము రెడీనే కానీ బాల‌య్య సినిమాకు మాత్రం రూ.15 కోట్ల‌యిన పెడ‌తామంటున్నార‌ట‌. కానీ మేక‌ర్స్ మాత్రం రెండు క‌లిపి తీసుకోవాల్సిందేన‌ని చెబుతుండ‌టంతో డిస్ట్రిబ్యూట‌ర్లు ఆలోచిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీడెడ్ లో చిరు సినిమాకు మించి బాల‌య్య సినిమాకే డిమాండ్ వున్న‌ట్టుగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.