Begin typing your search above and press return to search.
'ఆచార్యతో భారీగా నష్టపోయా.. ఆదుకోండి ప్లీజ్'
By: Tupaki Desk | 7 May 2022 6:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. మెగా తండ్రీకొడుకులు నటించిన సినిమా నాలుగు రోజులకే థియేటర్లలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.
'ఆచార్య' సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ డే పర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి భారీ డ్రాప్స్ ను చవి చూసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాలుగో రోజు సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట' మూవీ కంటే తక్కువ షేర్ వచ్చిందంటే ఏ రేంజ్ ప్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోయారు.
సినిమా రిజల్ట్ వచ్చినప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఆచార్య నిర్మాతల నుంచి నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ ఒకరు నష్టపరిహారాన్ని కోరుతూ 'ఆచార్య' మేకర్స్ కి రాసిన బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. రాయచూర్ డిస్ట్రిబ్యూటర్ & ఎగ్జిబిటర్ రాజ్‌గోపాల్ బజాజ్ భారీ బజ్ మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో భారీ నష్టాలను మిగిల్చింది. ఈ మేరకు చిరంజీవికి ఓపెన్ లెటర్ రాశారు. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడం వాళ్ళ పెట్టుబడిలో కేవలం 25% మాత్రమే వచ్చాయని.. 75% నష్టపోయామని పేర్కొన్నారు. అప్పు తెచ్చి ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశామని.. పెద్ద మనసుతో పరిస్థితిని అర్థం చేసుకొని పరిహారం చెల్లించాలని అభ్యర్థించారు.
''సినిమా ఆశించిన స్థాయిలో రన్ కానందుకు నేను చాలా నిరాశకు గురయ్యాను. ఏడాది క్రితమే మా ప్రాంతానికి సినిమా బుక్ చేశాను. సినిమా విడుదలకు ముందే అంగీకరించిన మేరకు మొత్తం చెల్లించాను. మేము కార్తకియే ఎగ్జిబిటర్స్ వరంగల్ శ్రీను గారుకి భారీ ప్రీమియం చెల్లించాము. ఇప్పుడు ఆ సినిమా ఆశించిన స్థాయిలో రన్ కాకపోవడంతో ఈ సినిమాలో నాకు భారీ నష్టం వాటిల్లింది. కోవిడ్ వేవ్ సమయంలో మాలాంటి పంపిణీదారులు భారీ నష్టాన్ని చవిచూశారని మీకు చాలా తెలుసు''
''ఈ సినిమా కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారాన్ని అందజేయాలని నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. మేము ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టిన మొత్తంలో 25% మాత్రమే తిరిగి పొందాము. 75% పెట్టుబడి పెట్టిన నష్టాలుగా తుడిచిపెట్టుకుపోతుంది. నేను మార్కెట్ నుండి డబ్బు అప్పుగా తీసుకుని ఈ సినిమాలో పెట్టుబడి పెట్టాను. కానీ ఇప్పుడు అప్పుల పాలయ్యాను'' అని డిస్ట్రిబ్యూటర్ లేఖలో పేర్కొన్నారు.
'ఆచార్య' సినిమా నిర్మాణానికి దాదాపు 100 కోట్లు అయిందని సమాచారం. ఈ రెండేళ్లలో వడ్డీలు 50 కోట్ల వరకూ ఉన్నాయి. మిగతా అన్నీ కలుపుకొని మొత్తం మీద 170 కోట్ల వరకూ అయింది. సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ అన్ని ఏరియాలలో అధిక రేట్లకే అమ్మారు. అయితే మూవీ డిజాస్టర్ అవడంతో అందరికీ నష్టాలు వచ్చాయి. 70 నుండి 80 శాతం మేర డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయామని చెప్తున్న తరుణంలో చిరంజీవి లేదా మేకర్స్ వారిని ఆదుకుంటారో లేదో చూడాలి.