Begin typing your search above and press return to search.
కామెంట్: పండుగ ధియేటర్ల వారికే!!
By: Tupaki Desk | 9 Jan 2016 5:30 PM GMTసంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చేతున్నాయ్. అయితే ఇందులో బాబాయ్ డిక్టేటర్ అండ్ అబ్బాయ్ నాన్నకు ప్రేమాతో మాత్రం భారీ కాంపిటీటర్లనే చెప్పాలి. ఇక నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా, అలాగే శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా కూడా తక్కువేం కాదు. ఇంతకీ ఈ రేసును ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారు.. నిర్మాతల టెన్షన్ ఎలా ఉంది.. ఎవరికి ఎన్ని ధియేటర్లు దొరుకుతాయ్.. ఇలాంటి ప్రశ్నలకంటే.. అసలు ఈ రేసుతో బాగా బాగుపడేది ఎవరో తెలుసా?
ఇంకెవరు.. ధియేటర్లవారే ఈ కొట్టుడుతో పుల్లుగా లాభాలు కొట్టేస్తుంటారు. ఎలాగంటారా.. ఇప్పుడు 'ఎ' సెంటర్లలో ఎవ్వరికీ ఇన్నేసి సినిమాలు వస్తున్నా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎ సెంటర్లలో ఉండే మల్టీప్లెకస్సుల్లో మనోళ్లు.. ఒకే ధియేటర్లో అన్ని స్ర్కీన్లలో ఒకటే సినిమా వేయరు. వారికి పండగ రిలీజ్ లన్నీ కావాలి. అయితే 'బి' 'సి' సెంటర్లు ఉన్నాయి చూడండి.. దీని తస్సారవలా బడ్డూ.. అక్కడే ఉంది ఫిట్టింగ్ అంతా.
బి అండ్ సి సెంటర్లలో ఎక్కువగా ఉండేది సింగిల్ స్ర్కీన్ ధియేటర్లలో. సో.. ఎవరి సినిమా ఉంటే వారిదే ఉంటుంది. అందుకే పంపిణీదారులందరూ ఈ ధియేటర్లను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. సో.. ఈ తరుణంలో క్యాష్ చేసుకోవాలని చూస్తున్న ధియేటర్లు.. రెగ్యులర్ రెంట్ కాకుండా మాకు ఈసారి రెవెన్యూ షేరింగ్ బేసిస్ లో కావాలి అంటున్నారట. కొన్ని సినిమాల పంపిణీదారులు 50:50 కూడా ఆఫర్ చేస్తున్నారట. ఇంకేముంది ధియేటర్ల వారికి పండగే!!