Begin typing your search above and press return to search.
డిస్ట్రిబ్యూటర్లు భయపడే రేట్లు చెప్తున్నారట!
By: Tupaki Desk | 4 March 2020 5:32 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఫిలిం మేకర్స్ ఉన్నారట. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. త్వరలోనే ఫస్ట్ లిరికల్ సాంగ్.. టీజర్ ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఓ వైపు ప్రమోషన్స్ నెమ్మదిగా ప్రారంభమవుతూ ఉంటే మరోవైపు ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంక్వయిరీలు కూడా వస్తున్నాయట. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు.. ఆ సినిమాకు కంటెంట్ తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటుంది.. డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు చెప్తున్న రేట్లు మాత్రం డిస్ట్రిబ్యూటర్లను బెదరగొడుతున్నాయని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ రీ-ఎంట్రీ సినిమా రైట్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమే కానీ ఈ సినిమా రీమేక్ కావడం.. ఒరిజినల్ వెర్షన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం తో ఆలోచనలలో పడి పోతున్నారట. ఎక్కువ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలమా అనే సందేహాలు వారిని పట్టి పీడిస్తున్నాయట.
రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఇలా భయపడుతున్నారు కానీ కొందరు కొత్తవారు మాత్రం రేట్ ఎక్కువైనా కొన్ని ఏరియాల రైట్స్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారట. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు సాగుతున్నాయని సమాచారం ఫస్ట్ సాంగ్.. టీజర్ రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.