Begin typing your search above and press return to search.

మల్టీ స్టారర్ మేకింగ్ లో విభేదాలు?

By:  Tupaki Desk   |   4 Sep 2019 2:01 AM GMT
మల్టీ స్టారర్ మేకింగ్ లో విభేదాలు?
X
ఒక సినిమా అవుట్ ఫుట్ బాగా రావాలంటే యాక్టర్స్ దగ్గరనుంచి టెక్నీషియన్స్ దాకా ప్రతిఒక్కరి మధ్యా అవగాహన చాలా అవసరం. ఈ కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా క్వాలిటీ తేడా కొట్టేసి బొమ్మ బొంబాయి వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచువేషన్ లోనే ఓ మల్టీ స్టారర్ ఉందని ఫిలిం నగర్ గాసిప్. విషయానికి వస్తే అదొక క్రేజీ మల్టీ స్టారర్. ఓ సీనియర్ హీరో అతని మేనల్లుడు కలిసి మొదటిసారి ఫుల్ లెంత్ కాంబో చేస్తున్నారు. స్వయానా ఆ సీనియర్ స్టార్ అన్నయ్యే నిర్మాతల్లో ఒకరు.

దర్శకుడిని కాస్త పేరున్న అతన్నే తీసుకున్నారు. టైటిల్ క్రేజీగా ఉంది. షూటింగ్ కు ముందే హైప్ వచ్చింది. ఇంకేం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న దశలో సదరు అన్నయ్య నిర్మాత డైరెక్టర్ మీద గరంగరంగా ఉన్నాడట. కారణం ఏంటయ్యా అంటే ఆశించిన విధంగా సినిమా రూపొందడం లేదని ఆయన కంప్లైంట్. అసలే ఆయన పర్ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్తారని ఇండస్ట్రీ టాక్. అలాంటిది స్వంత తమ్ముడు మేనల్లుడు సినిమా అంటే ఊరికే ఉంటారా. ఇక్కడితో అయిపోలేదు.

నిర్మాతల్లో మరొకరు అయిన సీనియర్ రచయితను పిలిచి ఈ దర్శకుడిని అదే పనిగా రికమండ్ చేసినందుకు కాస్త తలంటు పోసినట్టు వినికిడి. దసరాకు విడుదల చేయాలనుకున్న సినిమా కాస్తా ఇప్పుడు దీపావళికి లేదా ఆ తర్వాత వచ్చే పరిస్థితి రావడంతో ఇప్పుడు సదరు యూనిట్ మొత్తం హాట్ గా ఉందట. దర్శకుడు మాత్రం అనవసరంగా తనను శంకిస్తున్నారని సినిమా చాలా బాగా వస్తోందని ఎంత చెబుతున్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని ఇన్ సైడ్ టాక్