Begin typing your search above and press return to search.

నువ్వు ఐస్‌ క్రీమ్ తింటుంటే మాకు నోరు ఊరుతుంది

By:  Tupaki Desk   |   15 April 2023 9:44 AM
నువ్వు ఐస్‌ క్రీమ్ తింటుంటే మాకు నోరు ఊరుతుంది
X
పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. డైలాగ్ ఆర్టిస్టుగా చేసిన దివికి ఏ సినిమా తో గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు స్కిన్‌ షో విషయంలో హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు షో చేయడం తో ఈమెను అభిమానించే వారు ఎక్కువ అయ్యారు.

బిగ్ బాస్ నుంచి తొందరగానే బయటకు వచ్చినా కూడా దివికి మంచి పాపులారిటీ సొంతం అయ్యింది. బిగ్ బాస్ వల్ల ఇన్ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడి జోరు పెరిగింది. మిలియన్ ఫాలోవర్స్ ను ఇన్‌ స్టా లో సొంతం చేసుకున్న ఈ అమ్మడి యొక్క జోరు హీరోయిన్స్‌ కు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఉంది అనడంలో సందేహం లేదు.

స్కిన్‌ షో చేస్తూ.. చీర కట్టులో విభిన్నమైన ఫొటోలు షేర్ చేస్తూ ఈ అమ్మడు ఆకట్టుకునే రీతిలో దూసుకు పోతుంది. తాజాగా మరోసారి దివి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి అందాల ఆరబోత చేయకున్నా కూడా రొమాంటిక్ ఫోజ్ లు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఐస్ క్రీమ్ తింటూ కెమెరా కి ఇచ్చిన ఫోజ్ అందరినీ ఆకట్టుకుంటుంది. దివి ఐస్ క్రీమ్‌ తింటూ ఉంటే మాకు నోరు ఊరుతుంది అంటూ కొందరు డబుల్‌ మీనింగ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోలకు నెట్టింట మంచి స్పందన లభించింది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే గత ఏడాది చిరంజీవి గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రను చేసి మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆకట్టుకునే రూపం ఉన్నా కూడా హీరోయిన్‌ పాత్రలు లభించడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు... సిరీస్ ల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న దివి ముందు ముందు అయినా హీరోయిన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.