Begin typing your search above and press return to search.

మోస్ట్ డిజైరబుల్ బ్యూటీ.. ఆ విషయంలో అసలు తగ్గట్లేదుగా!

By:  Tupaki Desk   |   15 Jun 2021 5:30 PM GMT
మోస్ట్ డిజైరబుల్ బ్యూటీ.. ఆ విషయంలో అసలు తగ్గట్లేదుగా!
X
ఇటీవలి కాలంలో బిగ్ బాస్ బ్యూటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ అయిపోతున్నారు. అసలు మొన్నటివరకు పరిచయం లేని ముఖాలు ఈరోజు మోస్ట్ పాపులర్ ఫేసెస్ గా వెలిగిపోతున్నాయి. కేవలం బిగ్ బాస్ ద్వారా ఫేమ్ పొంది ఏకంగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా సర్ప్రైజ్ చేసిన కుర్రబ్యూటీ దివి.. ఈ భామ బిగ్ బాస్ రాకముందు అసలు ఎవరో కూడా సరిగా తెలియదు. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సినీ ప్రేక్షకుల నోళ్లలో కూడా అమ్మడి పేరు నానుతోంది అంటే అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం అలాంటి క్రేజ్ ఎంజాయ్ చేస్తోంది దివి. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా టైటిల్ గెలిచి టాలీవుడ్ సెలబ్రిటీస్ అటెన్షన్ అందుకుంది. మహర్షి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోడల్ దివి. బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ గా మాత్రం బాగా సుపరిచితం. అలా బిగ్ బాస్ పుణ్యమా అని దివి టీవీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ నుండి బయటికి రాగానే అదిరిపోయే అందాలషోతో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయినటువంటి దివి అదే షో ద్వారా మెగాస్టార్ చిరంజీవి దృష్టిని కూడా ఆకర్షించింది.

ఇటీవలే 'నా అందం కంటే ఎక్కువగా జనాలు నా క్యారెక్టర్ ఇష్టపడతారు. నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్లుగా భావించాలని అనుకుంటున్నాను. అందం కాలంతో పాటు మారిపోతుంది. కానీ తెలివి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. కాబట్టి నేను ఎల్లప్పుడూ మరింత తెలివిగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా అమ్మడి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ గాగ్ర టైప్ డ్రెస్ లో దివి గ్లామరస్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఎల్లో - చాక్లెట్ - ఆరంజ్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ పోజులతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వయ్యారికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వారికోసమే ఈ అందాలషో అంటోందట. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తోంది. చూడాలి మరి త్వరలో ఏదైనా పెద్ద సినిమాలో కనిపిస్తుందేమో..!