Begin typing your search above and press return to search.
విడాకులు తీసుకుని మంచి పని చేశా
By: Tupaki Desk | 11 July 2021 12:30 PM GMTబాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సుపర్ణ మొయిత్రా రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఆమె రెండవ పెళ్లి చేసుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. కాలేజ్ డేస్ నుండే మోడలింగ్ పై ఆసక్తి ఉన్నా కూడా పెళ్లి తర్వాత అన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. చదువు పూర్తి అయిన వెంటనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. పెళ్లి తర్వాత ముంబయిలో స్థిర పడ్డాం. కూతురు రియా మొయిత్రా పుట్టిన కొన్నాళ్లకే మేము విడాకులు తీసుకున్నాం. పాప బాధ్యతను నేను తీసుకున్నాను. సింగిల్ పేరెంట్ గా పాపను పెంచడం కష్టమైన పనే అయినా కూడా రియా కోసం అన్ని భరించేందుకు సిద్దం అయ్యాను.
విడాకులు తీసుకున్న కొన్ని రోజుల్లోనే మోడలింగ్ లో అడుగు పెట్టాను. కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ పై ఆకర్షితురాలిని అయ్యాను కాని అడుగు పడలేదు. కాని విడాకులు తీసుకున్న తర్వాత ఏదో ఒక రంగంలో అడుగు పెట్టాలనుకుని మోడలింగ్ కు వెళ్లాను. మోడల్ గా మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే టీవీ సీరియల్స్ లో ఆఫర్లు వచ్చేవి. 2015 లో సినిమాల్లో నటిగా అవకాశం వచ్చింది. అప్పటి నుండి వరుస అవకాశాలతో కొనసాగుతూ వస్తున్నాను. వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటిస్తూ ఉంది.
మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న ఈమె ఇటీవల ముంబయి వ్యాపారవేత్త అయిన రాహుల్ అగర్వాల్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ ను కొనసాగించే అవకాశం ఆయన ఇచ్చాడు. కనుక మొదటి భర్తకు విడాకులు ఇచ్చి నేను మంచి పని చేశాను అని అనుకుంటాను. ఎందుకంటే మొదటి భర్తతో ఉంటే నా జీవితం మొత్తం ఒక గృహిణిగా ఉండేదాన్ని. విడాకులు తీసుకోవడం వల్లే కొత్త జీవితం లభించింది అని సుపర్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.