Begin typing your search above and press return to search.
లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానన్న మమ్మీ
By: Tupaki Desk | 16 Nov 2021 11:30 PM GMTపెళ్లైన తర్వాత సినిమా రంగంలో రాణించడం కాంప్లికేషన్ తో కూడుకున్నదే. అప్పటికే వయసు 30 దాటిపోతుంది. పెళ్లైపోతుంది కాబట్టి ఇక సెకెండ్ ఇన్నింగ్స్ లో మమ్మీ..అక్క..చెల్లి లాంటి సపోర్టింగ్ రోల్స్ కే పరిమితవ్వాల్సి ఉంటుందంటారు. అయితే ఈ రూల్ ని దీపికా పదుకొణే..కరీనా కపూర్ లాంటి వాళ్లు బ్రేక్ చేసారనే చెప్పాలి. పెళ్లై మామ్స్ అయినా వీళ్లంతా ఇంకా బాలీవుడ్ ని ఏల్తున్నారు. పెళ్లికాని భామల్లా ఎంతో చలాకీగా కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు. ఇదే బాటలో తాను పయనిస్తానంటూ 17 క్రితం ముఖానికి మేకప్ వేసుకుని ప్యాకప్ చెప్పిన ఓ భామ అంటోంది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.
`అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో` చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన దివ్య ఖోస్లో కుమార్ సుపరిచితురాలే. ఈ సినిమా తర్వాత దివ్య నటిగా అంత బిజీ కాలేదు. దీంతో నిర్మాతగా..డైరెక్టర్ గా కొన్ని సినిమాలు నిర్మించింది. మళ్లీ మనసు మేకప్ వైపు మళ్లీఇందో ఏమో! 17 ఏళ్ల గ్యాప్ అనంతరం జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న `సత్యమేవ జయతే-2` చిత్రంతో కంబ్యాక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో ఆసక్తిర విషయాలు వెల్లడించింది. గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇవ్వడం పెద్ద బాధగా లేదు. ఇంకా చెప్పాలంటే సరైన సమయంలోనే కంబ్యాక్ అవుతున్నాను? అన్న సంతోషమే ఉంది.
ఇప్పుడున్న రచయితలు నటీమణులకి మంచి పాత్రలు రాస్తున్నారు. నటనకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక పెళ్లి అనేది సినిమాలకు అడ్డంకి కాదని దీపికా..కరీనా లాంటి వారు నిరూపించారు. 90లలో పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. అంతా చాలా అప్డేటెడ్ గా ఉన్నాం. ఆరకంగానే ముందుకు వెళ్లిపోతున్నాం. కాబట్టి ఆలస్యమైనా! ఇదే రైట్ టైమ్ అని నాకనిపిస్తుందని`` దివ్య ఖోస్లా అన్నారు.