Begin typing your search above and press return to search.
బాపుబొమ్మే మహానటి మదర్
By: Tupaki Desk | 23 Jan 2018 5:35 AM GMTఅచ్చ తెలుగు అందానికి పోలికగా ముచ్చటగా పలికే ముద్దు పేరు బాపు బొమ్మ అని. బాపు బొమ్మ అన్న మాటకు అక్షరాలా సరిపోయేట్టు కనిపించి తెలుగు ప్రేక్షకులందరినీ మురిపించింది అప్పట్లో దివ్యవాణి. బాపు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిపుస్తకం సినిమా హీరోయిన్ గానే ఈనాటికీ దివ్యవాణిని తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకున్నారంటే ఆమె అప్పట్లో ఏ రేంజిలో మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ మధ్య సినిమాల్లో కాకుండా టీవీ సీరియళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్న దివ్యవాణి తెలుగు తెరపై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. తొలిసారి కెరీర్ లో హీరోయిన్ తల్లి పాత్రలో వెండితెరపై కనిపించనుంది. అలనాటి మహానటి సావిత్రి జీవిత గాథతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మహానటి సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ కు తల్లిగా నటిస్తోంది. అంటే నిజజీవితంలో సావిత్రి తల్లి పాత్రను దివ్యవాణి ఈ సినిమాలో చేస్తోంది. ఇంతవరకు చెన్నైలో ఉన్న తాను తన కుమార్తె చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చానని దివ్యవాణి చెబుతోంది. నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనంటోంది దివ్యవాణి.
మహానటి సినిమాలో ప్రతి పాత్రకు నటులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని మరీ తీసుకుంటున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఎస్.వి.రంగారావు పాత్రను మోహన్ బాబు.. ఏఎన్నార్ పాత్రను విజయ్ దేవరకొండ.. సావిత్రి భర్త పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నారు. జమున పాత్రను అర్జున్ రెడ్డి ఫేం షాలినీ చేస్తోంది. ఇప్పుడు సావిత్రి తల్లి పాత్రకు దివ్యవాణి లాంటి సీనియర్ యాక్టర్ తో చేయిస్తున్నారు. కాస్టింగ్ విషయంలో చాలా కాలిక్యులేటెడ్ గా వెళ్లున్నారు మహానటి టీం.