Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ ను అన్యాయం చేసిన సమంత
By: Tupaki Desk | 11 April 2019 11:28 AM GMTఇటీవల వచ్చిన 'మజిలీ' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చైతూ కెరీర్ లో ఉత్తమ చిత్రాల్లో ఒక చిత్రంగా మజిలీ నిలుస్తుందని అంతా అంటున్నారు. నాగచైతన్య, సమంతల నటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సమంత ఒక మెచ్యూర్డ్ పాత్రలో అద్బుతంగా నటించి మెప్పించిందని అంటున్నారు. అయితే ఇదే సినిమాలో ఉన్న మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ గురించి మాత్రం అసలు చర్చే లేదు. ఈ సినిమాలో ఆమె చేసినట్లుగా కూడా ప్రచారం జరగడం లేదు.
సినిమా ఫస్ట్ హాఫ్ ముగియబోతుండగా సమంత ఎంట్రీ ఇస్తుంది. అంతకు ముందు అంతా కూడా దివ్యాంశ కౌశిక్ నే చూస్తాం. కాని ఎప్పుడైతే సమంత సీన్ లోకి ఎంట్రీ అవుతుందో దివ్యాంశ కౌశిక్ గురించిన ఆలోచనలో లేదు. సినిమాలో సమంతది ఎంత పాత్ర ఉందో దివ్యాంశది కూడా అంతే పాత్ర ఉంటుంది. అయినా కూడా సమంతకు వచ్చినంత గుర్తింపు, పేరు మాత్రం దివ్యాంశకు రాలేదు. సమంత - నాగచైతన్యల జోడీ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు.
ఈ చిత్రంలో సమంత మంచి నటనను కనబర్చింది, అయితే అదే సమయంలో దివ్యాంశ కూడా మంచి పాత్రలో, ఆకట్టుకునేలా నటించింది. కాని సమంత గురించే మాట్లాడుతున్నారు తప్ప దివ్యాంశ గురించి మాత్రం మాట్లాడటం లేదు. సమంత వల్ల దివ్యాంశ కనిపించడం లేదు. కొత్త హీరోయిన్ ను సమంత కమ్మేసిందనే టాక్ వస్తుంది. మొత్తానికి మజిలీ చిత్రం హిట్ అయినా దివ్యాంశ మాత్రం గుర్తింపును దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.