Begin typing your search above and press return to search.
'ఎమ్మార్వో' కోసం తెలుగుతో కుస్తీ
By: Tupaki Desk | 3 July 2021 11:30 AM GMTనాగచైతన్య .. సమంతలు నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ మూవీ 'మజిలి' లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్ మొదటి సినిమా తో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఆ సినిమాలో సమంత మరియు నాగచైతన్య మాత్రమే కనిపించారు తప్ప మరెవ్వరు కూడా ప్రేక్షకులకు కనిపించలేదు. అందుకే దివ్యాంశ కౌశిక్ కు మొదటి సినిమాతో గుర్తింపు రాలేదు. రెండవ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈమెకు రవితేజ మూవీలో నటించే అవకాశం దక్కింది. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో రవితేజ కు జోడీగా ఈమె ఎంపిక అయ్యిందని సమాచారం అందుతోంది.
ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా కోసం దివ్యాంశ కౌశిక్ కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలోని పాత్ర కోసం మాత్రమే కాకుండా ముందు ముందు టాలీవుడ్ లో జెండా పాతేందుకు గాను తెలుగు నేర్చుకుంటుందట. తెలుగు నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక తెలుగు టీచర్ ను ఆన్ లైన్ లో నియమించుకుందని కూడా సమాచారం అందుతోంది. తెలుగు నేర్చుకుంటున్న ఈ అమ్మడు సినిమా లోని తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పాలని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న ముద్దుగుమ్మలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈమె కూడా తన డబ్బింగ్ తానే చెప్పాలని ప్రయత్నాలు చేస్తుందట.
ఇక రవితేజ.. శరత్ మండవల కాంబో సినిమాకు ఎమ్మార్వో అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టైటిల్ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా లో రవితేజ తహసీల్దార్ గా కనిపించబోతున్నాడని.. ఆయన ప్రభుత్వ ఆఫీసర్ గా విధి నిర్వహిస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన వారిని.. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారికి ఎలా బుద్ది చెప్తాడు అనేది సినిమా కథ గా చెబుతున్నారు. తెలుగు హీరోలు ఎమ్మార్వోలుగా నటించడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. రవితేజ ఇలా నటించడం వల్ల ఖచ్చితంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా ను ప్రత్యేకంగా చూస్తున్నారు.
సినిమా కథ నచ్చడం వల్ల ఖిలాడి సినిమా పూర్తి అయిన తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా శరత్ మండవ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ ఏడాది చివరి వరకు సినిమా ను ముగించాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే మజిలి బ్యూటీ దివ్యాంశ కౌశిక్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ దక్కినట్లు అవుతుంది. ఎమ్మార్వో సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంటుంది కనుక ఇకపై వరుసగా ఈమె తెలుగు లో నటిస్తుందేమో చూడాలి.