Begin typing your search above and press return to search.
ఈ సినిమాలన్నీ దీపావళి టపాసులు!
By: Tupaki Desk | 10 Nov 2015 5:30 PM GMTతంబీలకు దీపావళి సెంటిమెంటు ..! అందుకే తమిళనాట ఈనెల 11న బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే రేసులో మాత్రం ఓ రెండు క్రేజీ సినిమాలు హోరా హోరీకి రెడీ అవుతున్నాయి. ఒకటి విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా నటించిన తూంగవనం - ఇంకొకటి అజిత్ హీరోగా శివ దర్శెకత్వం వహించిన వేదాళం.. ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.
అలాగే టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనిది.. ఫార్ములాని బ్రేక్ చేస్తూ అమావాస్య సెంటిమెంటుతో పని లేకుండా అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని దూసుకొస్తున్నాడు. సరిగ్గా దీపావళి రోజున అఖిల్ నటించిన అఖిల్ - ది జువా చిత్రం రిలీజవుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదో యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. అన్ని వర్గాలకు నచ్చుతుందని దర్శకహీరోలు ఇప్పటికే చెప్పారు.
ఈ సినిమాతో పాటు కన్నడలో కిల్లింగ్ వీరప్పన్ - బాక్సర్ - రామ్ లీల చిత్రాలు రిలీజవుతున్నాయి. మలయాళంలో అనార్కలి అనే చిత్రం రిలీజవుతోంది. దాదాపు డజను సినిమాలు సౌత్ మొత్తం మీద రిలీజవుతున్నాయి. వీటిలో ఎన్ని హిట్టు కొడతాయో చూడాలి.
కమల్ హాసన్ నటించిన తూంగవనం తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందన్న అంచనాలున్నాయి. ఓ డిఫరెంట్ జోనర్ ని ఈ సినిమాతో టచ్ చేశానని కమల్ హాసన్ చెప్పారు. మనవాళ్లకు ఫాస్ట్ ఫేసింగ్ థ్రిల్లర్ కొత్త. ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానని కమల్ ఆసక్తి రేకెత్తించారు. ఫ్రెంచి సినిమా స్లీప్ లెస్ నైట్స్ కి రీమేక్ ఇదని కమల్ చెప్పారు. ఆ చిత్రం నచ్చడం వల్లనే .. మంచి సినిమా చూపించాలన్న ఆసక్తితోనే తమిళ్ - తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తెస్తున్నానని అన్నారు. ఈనెల న11న దీపావళి కానుకగా రిలీజవుతోంది. అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించిన మాస్ ఎంటర్ టైనర్ వేదాళం పైనా అజిత్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కాబట్టి ఈ రెండిటి మధ్య బాహా బాహీ తప్పదని అంటున్నారు.