Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: దీపావ‌ళి దేవ‌త‌లు టూ హాట్ గురూ

By:  Tupaki Desk   |   25 Oct 2022 2:30 AM GMT
ట్రెండీ స్టోరి: దీపావ‌ళి దేవ‌త‌లు టూ హాట్ గురూ
X
దీపావళి అనేది గ్లిట్జ్ అండ్ గ్లామర్ ని ఆవిష్క‌రించే పండ‌గ‌. దీపాల కాంతుల్లో ధ‌గ‌ధ‌గ‌లు హొయ‌లు పోయే స‌మ‌య‌మిది. అందాల క‌థానాయిక‌లు తమవైన వ‌స్త్ర‌ధార‌ణ‌లు అలంక‌ర‌ణ‌ల‌తో ఒక‌టే సంద‌డి చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి టీటౌన్ బిటౌన్ భామ‌లు మ‌తాబుల్లా వెలిగిపోతున్నారు.

ఇటీవ‌లే టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన‌ అనన్య పాండే.. అందాల‌ కియారా అద్వానీ.. టాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్న జాన్వీ కపూర్ .. మ‌న మ‌న‌సులు దోచిన మ‌ల్లీశ్వ‌రి కత్రినా కైఫ్.. పొడుగు కాళ్ల సోగ్గ‌త్తె ర‌కుల్ ప్రీత్ సింగ్.. ట్యాలెంటెడ్ భూమి పెడ్నేక‌ర్  వంటి నటీమణులు తమ గ్లామర్ ఎలివేష‌న్ తో దుమ్ము దులిపారు. కొంతమంది తమ లుక్స్ తో మన హృదయాలను దోచుకుంటే.. కొందరు తమ ఫ్యాషన్ గేమ్ తో అల్లాడించారు.

బాలీవుడ్ ప్ర‌ముఖులంతా త‌మ ఇండ్ల‌కి స‌హ‌చ‌రుల‌ను ఆహ్వానిస్తూ దీపాల పండుగ‌ను సంబ‌రంగా జ‌రుపుకుంటున్నారు. ప్ర‌తిచోటా ఈ భామ‌లంతా ఎల్ల‌పుడూ ఫ్యాషన్ గేమ్ తో పాపులారిటీని పెంచుకున్నారు. ప్రతి ఒక్కరూ నగరంలో ఉత్తమ ఫ్యాషన్ ఎలివేష‌న్ తో అల‌రించిన భామ‌లే. అయితే ఈ దీపావళి సీజన్‌లో కొన్ని లుక్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. కొన్ని మాత్రం మిస్ అయ్యాయి!

కియారా అద్వానీ:

కియారా అద్వానీ ఈ దీపావళి పార్టీలలో ప్రతిరోజూ తన ఫ్యాషన్ గేమ్ ను మ‌రో లెవ‌ల్ కి తీసుకెళుతూ కొత్త‌గా ప్రయత్నించింది. గత రాత్రి ఈ బ్యూటీ తన దీపావళి రూపాన్ని పూర్తిగా ట్రెడిష‌న్ ని మిక్స్  చేసి అల‌రించింది. ఆమె రాయల్ బ్లూ కలర్ వెల్వెట్ ఫినిషింగ్ లెహంగా చోలీని ధరించి నెక్‌లైన్ డిటెయిలింగ్ తో కనిపించింది. ఈ దుస్తులపై గోల్డెన్ జారీ ఎంబ్రాయిడరీ ఆక‌ర్ష‌ణ పెంచింది. ఇది లుక్ కు అదనపు ఆకర్షణను జోడించింది. కియారా తన దుస్తులను ముత్యాల పూసల చోకర్ - కోల్-రిమ్డ్ గ్లామ్ మేకప్ తో హంగును పెంచింది. ఆమె వైబ్రెంట్ లెహంగా.. టోన్-డౌన్ మేకప్ అభిమానులకు పిచ్చిగా నచ్చింది.

కత్రినా కైఫ్:

కత్రినా కైఫ్ సిల్వర్ ఫ్లోరల్ డిటెయిలింగ్ తో కూడిన నల్లని రంగు చీరను ఎంచుకుంది. దానిని సీక్విన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో జ‌త‌క‌లిపింది. కత్రినా డిజైన‌ర్ చెవిపోగులు.. ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ వేలి ఉంగరాలు... పోల్కీ బ్యాంగిల్స్, ... స్మోకీ కళ్ళతో ఎర్ర‌బారిన‌ బుగ్గలతో n*de లిప్ షేడ్ తో తన రూపాన్ని సంథింగ్ స్పెష‌ల్ గా మార్చింది. ఒక‌ర‌కంగా క‌త్రిన క్లాసీగా క‌నిపిస్తోంది. అంత‌కుమించి హాట్ గాను చీర‌లో ఎలివేట్ అయ్యింది.


రకుల్ ప్రీత్ సింగ్:
రకుల్ ప్రీత్ సింగ్ ఎరుపు రంగులో మూడు ముక్కల డిజైన‌ర్ దుస్తుల‌ను ధరించింది. ఇందులో బ్రాలెట్, .. పలాజో .. కేప్ తో పాటు ఆమె భారీ డాంగ్లర్ లు  డ్యూ మేకప్ తో వ‌న్నె చిన్నెల వ‌య్యారాన్ని విర‌బోసింది. దీపావళికి పర్ఫెక్ట్ పిక్ ఇది. సెల‌క్టివ్ లుక్ తో అద‌ర‌గొట్టింది.

అనన్య పాండే:

అనన్య పాండే ఈ తరం ఫ్యాషనిష్టాగా పేరు తెచ్చుకుంది. ఆమె తన యూనిక్ స్టైల్ తో ప్ర‌త్యేక‌ ఎంపికలతో తన అభిమానుల‌ను ఎప్పుడూ నిరాశపరచలేదు. అయితే ఇటీవల దీపావళి పార్టీలలో ఓచోట ఇంకా స్పెష‌ల్ లుక్ తో మెరుపులు మెరిపించింది. ఆమె పిస్తా గ్రీన్ కలర్ లెహంగా చోలీని ధరించింది. అది వెండి అద్దాల తో ధ‌గ‌ధ‌గా మెరిసింది. ఈ ప్ర‌త్యేక‌ రూపాన్ని ఆక్సిడైజ్డ్ చెవిపోగులు .. మాంగ్ టీకాతో జత చేసింది. అన‌న్య డ్యూయి మేకప్ జ.. గెటప్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.


భూమి పెడ్నేకర్:

భూమి పెడ్నేకర్ ఇటీవలి కాలంలో తన A-గేమ్ ను ఫ్యాషన్ లోకి తీసుకువచ్చింది. ఆమె ఐస్-బ్లూ లుక్ నిజంగా యూనిక్. ఐస్-బ్లూ కలర్ థ్రెడ్ కి త‌గ్గ‌ట్టుగా సీక్విన్ ఎంబ్రాయిడరీ లెహంగా చోలీని ధరించి ఆ అంద‌మైన నాజూకు మిడ్-రిఫ్ ను ప్రదర్శించిన తీరు క‌వ్వించింది. భూమి మెరిసే ఐషాడో ...వింగ్ ఐలైనర్ .. మాస్కరా-లాడెన్ లాషెస్ .. మావ్ లిప్ షేడ్ తో తన రూపాన్ని అందంగా డిజైన్ చేసుకుంది. భారీ చోకర్ దానికి సరిపోలే చెవిపోగులతో వ్వావ్ అనిపించింది.  

కృతి సనన్:

ఈ దీపావళి పార్టీలలో చివరి కొన్ని రోజులలో కృతి సనన్ ఫ్లోర‌ల్ లుక్ దేవ‌తా సుంద‌రీమ‌ణులు అందరిలో ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేసింది. కృతి పింక్ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లెహంగాను ధరించి నెక్ లైన్ చోలీ -ఎంబ్రాయిడరీ బార్డర్ ను కలిగి ఉన్న షీర్ దుపట్టాను ధరించింది. స్నో ఐస్.. మినిమ‌ల్ అలంకరణతో తన రూపాన్ని అందంగా డిజైన్ చేసుకుంది. డిజైన‌ర్ దుస్తులు బజ్ ను సృష్టించేలా చేయడానికి అండర్ టోన్ మేకప్ ను ఎంపిక చేసుకుంది. అది ప‌ర్ఫెక్ట్ గా వ‌ర్క‌వుటైంది.

జాన్వీ కపూర్

జాన్వీ కపూర్... బాలీవుడ్ కైలీ జెన్నర్ లా అద‌ర‌గొడుతోంది. లంచ్ డేట్ అయినా, .. డిన్నర్ పార్టీ అయినా,... అవార్డ్ షో అయినా లేదా రెడ్ కార్పెట్ లుక్ అయినా ఈ న‌ట‌వార‌సురాలు ఎప్పుడూ ఫ్యాషన్ గేమ్ లో మొదటి స్థానంలో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా దీపావళి పార్టీలలో జాన్వీ నిజంగా గేమ్ లో దూసుకుపోతోంది. కానీ గత రాత్రి ఒక సాధారణ సీక్విన్డ్ ఐస్-బ్లూ కలర్ చీరను స్లీవ్ లెస్ బ్లౌజ్ తో క‌నిపించింది. నిజం చెప్పాలంటే జాన్వీ ఫ్యాషన్ స్టైల్ పరంగా ఇది చాలా రిపీటెడ్ లుక్. కానీ త‌న‌వైన‌ స్మోకీ కళ్ళు బ్రౌన్ లిప్ షేడ్ తో ఛ‌మ‌క్కులా అనిపించింది. బిగిస‌డ‌ల‌ని అందాలు మ‌న‌సును దోచుకునేలా ఎత్తుగ‌డ‌ను మార్చింది.

సారా అలీ ఖాన్:

దీపావ‌ళి లుక్ కోసం సారా అలీ ఖాన్ క్రీమ్-క‌ల‌ర్ లెహంగా చోళీని ఎంచుకుంది. ఇందులో సూక్ష్మమైన ఎరుపు-రంగు థ్రెడ్ లు ఉన్నాయి. దానిని బ్యాంగిల్స్ స్టాక్ -టాసెల్ నెక్ పీస్ తో జత చేసిన తీరు ఆక‌ట్టుకుంది. సారా గత రాత్రి కేదార్ నాథ్ వైబ్ ని తిరిగి తెచ్చింది. సారా త‌న సోద‌రుడితో క‌లిసి ఫోటోషూట్ల‌కు ఫోజులిచ్చింది. ఇంత‌మందిలో మీకు ఎవరి లుక్ బాగా నచ్చింది? ఎవరికి ఎంత రేటింగ్ ఇస్తారు? అన్న‌ది మీ ఇష్టం. దీపాల కాంతిలో దేవ‌త‌లంతా వెలిగిపోతున్నారు!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.