Begin typing your search above and press return to search.
ఉప్పి సినిమాని బన్నీ కాపీ???
By: Tupaki Desk | 6 Jun 2017 4:41 PM GMTఅల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే - దువ్వాడ జగన్నాధం ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి బోలెడంత హంగామా నడుస్తోంది. ముఖ్యంగా డీజే స్టోరీ విషయంలో బోలెడంత చర్చలు జరిగిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అదుర్స్.. రామయ్యా వస్తావయ్యాలను మిక్స్ చేసి.. డీజే స్టోరీని హరీష్ శంకర్ రూపొందించాడని కొందరు అంటున్నారు.
మరికొందరైతే ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి.. ఉపేంద్ర నటించిన కన్నడ సినిమా శివంతో పోలిక పెడుతున్నారు. తెలుగులో ఈ మూవీ బ్రాహ్మణ అని డబ్ కూడా అయింది. అయితే.. డీజే ట్రైలర్ ను చూస్తే కొత్తగా ఏదో చెప్పాలని ప్రయత్నించినట్లుగా కనిపించదు. ఓ సాధారణ బ్రాహ్మణ కుర్రాడు.. పైగా అమాయకుడు.. ఓ లవ్ స్టోరీ.. సాఫీగా నడిచే కథకు ఇంటర్వెల్ దగ్గర ఓ ట్విస్ట్ ఇచ్చి మరీ అమాయకుడు కాదని చెప్పడం.. ఇంటర్వెల్ తర్వాత ఓ ఫ్యాష్ బ్యాక్.. విలన్స్ తో ఫైటింగ్.. దువ్వాడ జగన్నాధం కథా కమామీషు ఇంతే కనిపిస్తోంది.
హీరో బ్రాహ్మణుడి పాత్ర అన్న పోలిక పట్టుకుని.. కాపీ అనాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. ఈ మాత్రం కథను పక్క భాష నుంచి తీసుకురావాల్సిన అవసరం హరీష్ శంకర్ కు ఏమీ ఉండదనే చెప్పచ్చు. కాకపోతే కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి.. తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాడంతే. బ్రాహ్మిన్ కేరక్టర్ తో పంచే నవ్వులు కాసిన్ని.. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు కొన్ని బోనస్ అవుతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/