Begin typing your search above and press return to search.
బుల్లి తెరపై భారీ యుద్ధం
By: Tupaki Desk | 10 Oct 2017 5:30 PM GMTసిల్వర్ స్క్రీన్ అయినా టెలివిజన్ స్క్రీన్ లో అయినా మన తారల పోటీ మాములుగా ఉండడం లేదు. ఎక్కడైనా అదే స్థాయిలో పోటీని కనబరుస్తూ రికార్డులు తిరగరాస్తున్నారు. ఏ మాత్రం తగ్గకుండా టెలివిజన్ ఛానల్స్ యాజమాన్యం కూడా ఒకే టైమ్ కి సినిమాలను టెలిక్యాస్ట్ చేస్తున్నాయి. అయితే ఈ వచ్చే సండేకి ఓ నాలుగు బడా చిత్రాలు బుల్లి తెరపై రేటింగ్ లను బద్దలుకొట్టడానికి రెడీ అవుతున్నాయి.
వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - కాటమరాయుడు సినిమా గురించి. ఈ సినిమా మెగా అభిమానులకు బాగానే నచ్చిగా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఈ సినిమా జెమిని ఛానల్ లో సండే సాయంత్రం టెలికాస్ట్ అవ్వనుంది. ఇక జీ తెలుగులో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ - దువ్వాడ జగన్నాథమ్ సినిమా కూడా అదే సమయానికి ప్రసారం కాబోతోంది. ఆ సినిమా శాటిలైట్ హక్కులు 16 కోట్లకు అమ్మడుపోయిన సంగతి తెలిసిందే.
ఇక రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా అదే రోజు మా టివి లో సాయంత్రం ప్రసారం కాబోతోంది. అయితే ఈ మూడు చిత్రాలు దాదాపు లేటెస్ట్ చిత్రాలనే చెప్పాలి. కానీ గుణ శేఖర్ రుద్రమ దేవి సినిమా మాత్రం రెండేళ్ల క్రితం సినిమా. చాలా లేటుగా ఆ సినిమా హక్కులను ఫైనల్ గా ఈటివి దక్కించుకొని ప్రసారం చేసుకోబోతోంది. మరి ఈ నాలుగు సినిమాలు బుల్లి తెరపై ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో చూడాలి.