Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: దువ్వాడ జగన్నాథమ్ వచ్చేశాడు

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:08 AM GMT
టీజర్ టాక్: దువ్వాడ జగన్నాథమ్ వచ్చేశాడు
X
నుదుట నామాలు.. చేతిలో రుద్రాక్ష దండ.. పొద్దున్నే నియమంగా హారతులు.. అబ్బో.. ఈ బ్రాహ్మణుడి లెక్కే వేరు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడిలా మారిపోయాడు. త్వరలో హరీశ్‌ శంకర్ డైరక్షన్లో రూపందుతున్న ''దువ్వాడ జగన్నాథమ్'' సినిమా కోసం మనోడి నయా గెటప్ ఇది. ఈ ఇంప్రెసివ్ లుక్కుతో ఇప్పుడు శివరాత్రి సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

అచ్చమైన బ్రాహ్మణుడిలా అల్లు అర్జున్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు. పైగా హరీశ్‌ శంకర్ స్వయంగా ఆయనే ఒక బ్రాహ్మణుడు కావడం వలనేమో.. ఈ క్యారక్టరైజేషన్ బాగా చెక్కేశాడు. అగ్రహారంలో అలా బండేసుకుని బన్నీ వెళుతుంటే దాని లెక్కే వేరుగా ఉంది. అదే సమయంలో అల్ర్టా మోడ్రన్ గా హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. అమ్మడు మనోడికి పచిక్ పచిక్ అని ముద్దులెట్టేస్తుంటే.. ''ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానాకి ఏం మెసేజ్ ఇద్దామని??'' అంటూ బ్రాహ్మణుడి తరహాలో బన్నీ చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్ అరిపించింది అనే చెప్పాలి.

ఇకపోతే వంటలు చేసుకునే ఆచారి పాత్రలో అల్లు అర్జున్ ఇరగదీయగా.. అయానక బోస్ అందించిన సినిమాటోగ్రాఫీ చాలాబాగుంది. తమ బ్యానర్ 25వ సినిమా కావడంతో.. దిల్ రాజు కూడా చాలా రిచ్ గా సినిమాను రూపొందించేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రస్తుతానికి జస్ట్ ఓకె.