Begin typing your search above and press return to search.
‘బాహుబలి’ ఉన్నాడు.. జాగ్రత్తపడదాం!
By: Tupaki Desk | 10 Feb 2017 5:00 AM GMTతెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తం ఇండియన్ ఆడియన్స్ అందరూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఎంతో సమయం లేదు. ఇంకో 80 రోజుల్లోపే సినిమా విడుదల అయిపోతుంది. మధ్యలో రిలీజ్ డేట్ గురించి కొంచెం సందేహాలు వినిపించాయి కానీ.. తాజా సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం ఏప్రిల్ 28నే ప్రేక్షకుల ముందుకొస్తుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో వేసవికి రావాల్సిన తెలుగు సినిమాలన్నీ కూడా అలెర్టయ్యాయి. ‘కాటమరాయుడు’ను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నుంచి వాయిదా వేయకూడదని పట్టుదలతో ఉంది ఆ చిత్ర బృందం. గతంతో పోలిస్తే తెలుగు సినిమాలకు ఈ మధ్య రన్ కొంచెం పెరిగింది. మూడు.. నాలుగు వారాల్లో సైతం మంచి వసూళ్లే వస్తున్నాయి. కాబట్టి మార్చిలోనే సినిమాను రిలీజ్ చేస్తే పాజిటివ్ టాక్ ఉంటే.. ‘బాహుబలి’ ప్రభావం పడకుండా మూడు.. నాలుగు వారాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ‘బాహుబలి’ తర్వాత రావాల్సిన పెద్ద సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ను మే మూడో వారంలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ‘బాహుబలి’ మేనియా ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. ‘బాహుబలి’ ఏమాత్రం అంచనాల్ని అందుకున్నా.. మోత మామూలుగా ఉండదు. దానికి దగ్గర్లో ఇంకో సినిమా వస్తే దెబ్బ మామూలుగా ఉండదు. కనీసం నెల రోజుల పాటు ఆ సినిమాను వదిలేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ‘డీజే’ను మే అంతటా కూడా రిలీజ్ చేయకుండా ఆపేస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు మేలో రిలీజ్ పెట్టుకుంటే ‘బాహుబలి’ వాయిదా పడితే ఇబ్బంది కదా అని జూన్ నెలాఖరుకు వెళ్లిపోయిన మహేష్ సినిమా విషయంలో కొంచెం తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ‘బాహుబలి’ ఏప్రిల్ 28కే ఫిక్సయిన నేపథ్యంలో తమ సినిమాను కొంచెం ముందుకు జరుపుదామా అని కొంచెం ఆలోచించారట కానీ.. ‘డీజే’నే వెనక్కి వెళ్లేలా ఉండటంతో మళ్లీ క్లాష్ ఎందుకని జూన్ 23కే ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/