Begin typing your search above and press return to search.
డీజేతో రాజు బాగానే వెనకేశాడట
By: Tupaki Desk | 8 Jun 2017 4:31 AM GMTఈ తరం ఫిలిం మేకర్స్ లో దిల్ రాజుకు ప్రత్యేకమైన స్థాయితో పాటు శైలి కూడా ఉంది. భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీసే ఈయన.. నష్టాలను మిగిల్చే ప్రాజెక్టుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ అతి తక్కువ లాస్ లతో బయటపడేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇక కచ్చితంగా లాభాలు వస్తాయనే ప్రాజెక్టుల విషయంలో మరో స్టైల్ ఆచరిస్తూ ఉంటాడు.
తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో దువ్వాడ జగన్నాధం నిర్మిస్తున్నాడు దిల్ రాజు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న 25వ చిత్రం 'డీజే' కావడంతో.. భారీగానే వెచ్చించాడు. ఈ సినిమాను నైజాంలో తనే స్వయంగా రిలీజ్ చేస్తాడని అనడంలో సందేహం అక్కర్లేదు. ఇక్కడ ఎలా లేదన్నా దువ్వాడ జగన్నాధం కనీసం 20 కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది మినహాయిస్తే మిగిలిన ఏరియాల డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి.
థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ ద్వారా మొత్తంగా డీజే ద్వారా 25 కోట్ల వరకూ దిల్ రాజుకు గిట్టుబాటు అయినట్లు చెప్పుకుంటున్నారు. పైగా దిల్ రాజు చేసుకున్న ఒప్పందాలు ప్రకారం ఓవర్ ఫ్లోస్ రూపంలో మరిన్ని వసూళ్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా డిజిటల్ రైట్స్ చేతిలోనే ఉన్నాయనే టాక్ ఉంది. డీజే ట్రైలర్ అత్యంత వేగంగా 10 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటిన విధానం చూస్తే.. ఈ మూవీపై క్రేజ్ అర్ధమవుతుంది. జూన్ 23న దువ్వాడ జగన్నాథం థియేటర్లలో హంగామా బిగిన్ చేసేయనున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/