Begin typing your search above and press return to search.

అమెరికాలో దులిపేస్తున్న DJ టిల్లు

By:  Tupaki Desk   |   14 Feb 2022 1:00 AM GMT
అమెరికాలో దులిపేస్తున్న DJ టిల్లు
X
DJ టిల్లు ఈ వారం విజేత‌గా రికార్డుల‌కెక్కాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు స‌హా విదేశాల్లో బంప‌ర్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంద‌ని ట్రేడ్ రిపోర్ట్ అందింది. ఫ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ సిద్ధు న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఇక ఈ మూవీ అమెరికా మార్కెట్ లో అద్భుత వ‌సూళ్ల‌ను సాధిస్తోంది.

టిల్లు యూఎస్ మార్కెట్ లో దులిపేస్తున్నాడు! పోటీలో పెద్ద హీరో సినిమా వ‌చ్చినా అది పూర్తిగా తేలిపోవ‌డంతో ఇక టిల్లు హ‌వాకి ఎదురే లేకుండా పోయింద‌నేది గుస‌గుస‌. DJ టిల్లు మొదటి రోజు (ప్రీమియర్స్ సహా) 248కె డాల‌ర్లు వసూలు చేసింది. ఇది ఈ స్థాయి వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ఎవరూ ఊహించ‌నిది. ఈ సంఖ్య ఊహించిన దానికంటే చాలా పెద్ద‌ద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంటర్ టైన్ మెంట్ ఫ్యాక్టర్ తెలుగు రాష్ట్రాల్లోనూ.. అమెరికాలోనూ పనిచేసింది. గత నెలలో అమెరికా మార్కెట్ ఏమంత గొప్ప‌గా లేదు. డీజే టిల్లు అద్భుతమైన విజయం త‌దుప‌రి రిలీజ్ కి వ‌స్తున్న చాలా సినిమాల‌కు పెద్ద బూస్టర్ గా నిలుస్తుంది. టిల్లు డిస్ట్రిబ్యూటర్లు ఒక్కరోజులోనే పెట్టుబడిని రికవరీ చేసి రానున్న రోజుల్లో లాభాలను అందుకోనున్నారు.

మౌత్ టాక్ ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ గా మారిందని స‌ర్వే రిపోర్ట్ చెబుతోంది. ఈ వారంతం వ‌సూళ్లు.. అలాగే ఏడు రోజుల క‌లెక్ష‌న్లు డీజే రేంజు ఎంతో చెబుతాయి. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వ‌ద్ద టిల్లు గ‌ర్జిస్తున్నాడు. నైజాంలోనూ ఈ సినిమా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించింద‌ని స‌మాచారం. తొలిరోజు క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌ల‌తో సంబంధం లేకుండా వినోదాన్ని ప్ర‌జ‌లు ఆస్వాధిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ ఫ‌న్ రైడ‌ర్ ని నిర్మించారు. ప‌లు భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే యువ‌హీరోల‌తో ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌డం సితార‌కు పెద్ద ప్లస్ గా మారింది.


డీజే టిల్లు హిట్టు.. నెక్ట్స్ ఏంటి?

నేటిత‌రం హీరోల్లో చెప్పుకోద‌గ్గ ప్ర‌తిభావంతులు ఎంద‌రో ఉన్నారు. కానీ వారికి ఒక టైమ్ రావాలి. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడాల్సిన ప‌నే ఉండ‌దు. ప్ర‌స్తుతం యువ‌న‌టుడు సిద్ధు జొన్నలగడ్డ టైమ్ వ‌చ్చింద‌నే అంతటా టాక్ వినిపిస్తోంది. అత‌డు డీజే టిల్లుగా ఆడియెన్ కి చ‌క్క‌ని వినోదాన్ని అందించేందుకు థియేటర్ల‌లోకి వ‌చ్చారు. ఇందులో ఒక విలక్షణ హైదరాబాదీ వ్యక్తిగా అత‌డి ఆహార్యం ఆద్యంతం ఫ‌న్ తో క‌ట్టి ప‌డేసింద‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు. స్వ‌త‌హాగా ర‌చ‌యిత అయిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లు మాట‌ల్ని అద్భుతంగా రాసారు. ఈ సినిమా క‌థాంశానికి నిజ‌ఘ‌ట‌న‌ల‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ``సినిమా విషయానికి వస్తే పరిణతి లేదా బ్యాలెన్సింగ్ నాకు కనీసం ఆసక్తికరం కాదు. వ్యక్తికి ఎటువంటి సమస్యలు లేకుంటే ప్రేక్షకులు ఆసక్తి చూపరు. అందుకే టిల్లు క్యారెక్టర్ ని లోపభూయిష్టంగా ప్రెజెంట్ చేశాను`` అని సిద్ధు తెలిపారు.

తనకు రాయడం కంటే నటనపైనే ఆసక్తి ఎక్కువని సిద్ధూ తెలిపాడు. నాకు నటనపై ఎక్కువ ఆసక్తి ఉంది. మరొకరి కోసం వ్రాయడానికి నాకు ఆసక్తి లేదు. నటన నా తొలి ప్ర‌యారిటీ అని.. యాభై ఒక‌టి శాతం న‌ట‌న‌కే ప్రాధాన్య‌త‌నిస్తాన‌ని తెలిపారు. నిజానికి సిద్ధు నాలుగు సంవత్సరాల పాటు తబలా నేర్చుకున్నాడు. ఇది తన సినిమాల సంగీతానికి సహాయపడుతుందని తెలిపాడు. డీజే టిల్లు పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రతి సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారు.

డీజే టిల్లు ప్రేక్షకులు యువత - మాస్.. ఫ్యామిలీ ఆడియన్స్ లో హాస్యం థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఇది నచ్చింది. సినిమా రన్ టైమ్ దాదాపు 2 గంటల 4 నిమిషాలు. మా వద్ద దాదాపు 1 గంట ఫుటేజ్ తొల‌గించిన‌ది ఉంది. మేము బహుశా విడుదలైన తర్వాత తొలగించబడిచ్చుతుందిన దృశ్యాల శ్రేణిని విడుదల చేస్తాము.. అని సిద్ధు తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ .. అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో సినిమాల స్క్రిప్ట్ లను వినడం అవసరమైతే తన విలువైన స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తారు మాయావి. తొలుత త్రివిక్రమ్ గారికి కథ చెప్పాం. తన అభిప్రాయాలను ఆలోచనలను తెలియజేశారు. మా స్టైల్ లో సినిమా తీయమని చెప్పారు`` అని అన్నారు. సొంత‌ కథలు తన స్వంత అనుభవాలు సిద్ధు ఎదుర్కొన్న సంఘటనల నుండి డీజే టిట్లు పుట్టాడ‌ని తెలిపారు.