Begin typing your search above and press return to search.
'డీజే టిల్లు' వసూళ్లు చూసి షాక్ తిన్న ట్రేడ్ పండితులు!
By: Tupaki Desk | 13 Feb 2022 4:30 PM GMTయంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన `డిజే టిల్లు` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. `ఖిలాడి`తో పోటీగా బరిలోకి దిగిన `డీజే టిల్లు` విమర్శకుల ప్రశలందుకుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సిద్దు నటనతో ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేస్తున్నాడు. చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ గా చెప్పొచ్చు.
తెలుగు రాష్ర్టాల్లో అనూహ్యమైన వసూళ్లతో ట్రేడ్ పండితులే షాక్ తింటున్నారు యంగ్ హీరోకి అమెరికాలో మార్కెట్ లేకపోయినా అక్కడా చక్కని వసూళ్లను సాధిస్తోంది. శనివారం అర్ధరాత్రి నాటికి యూఎస్ ఏ లో పావు మిలియన్ కు పైగా వసూళ్లను సాధించడం విశేషం.
నైజాంలో తొలి రోజు 1.63 కోట్లు షేర్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ర్టాల్లో 4 కోట్లు షేర్ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కడం తో టీమ్ సంతోషంగా ఉంది. సోమవారం నుంచి థియేటర్లు పెరిగే అవకాశం ఉండటంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక `ఖిలాడి`కి నెగిటివ్ టాక్ రావడంతో డిజేటిల్లు దే పైచేయిగా కనిపిస్తోంది.
ప్రస్తుతం `డీజేటిల్లు`కి పోటీగా మరే చిత్రాలు కూడా లేవు. వచ్చే శుక్రవారం వరకూ ఎలాంటి సినిమాలు రిలీజ్ లు కూడా లేవు. దీంతో సినిమా వచ్చే వీకెండ్ కి మరిన్ని కాసులు ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పరిమిత బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఈ రేంజ్లో మరో నాలుగైదు రోజులు దూసుకుపోతే మంచి లాభాలు బాట పట్టడం ఖాయం. సిద్దు కెరీర్ లో నే ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ గా చెప్పొచ్చు. మొత్తానికి `డీజే టిల్లు` సక్సెస్ తో టీమ్ నమ్మకం నిజమైంది. ఈ సక్సెస్ తో సిద్దు కెరీర్ కి పూలబాట పడినట్లే. హీరోగా రాణించాలని చాలా ప్రయత్నాలు చేసాడు.
కానీ అవేవి సిద్దుకి అంతగా పేరు తీసుకురాలేదు. `డీజేటిట్లు` రూపంలో వచ్చిన సక్సెస్ తో మరిన్ని అవకాశాలు రావడ ఖాయం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.