Begin typing your search above and press return to search.
ఆంక్షలున్నా రిపబ్లిక్ డే కు వస్తాయట
By: Tupaki Desk | 16 Jan 2022 10:11 AM GMTతెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు.. థియేటర్ల వద్ద ఆంక్షలు.. 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఏపీ లో ఇప్పటికే ఇవన్నీ అమలు అవ్వాల్సి ఉన్నా కూడా సంక్రాంతికి జనాలు ఇబ్బందులకు గురి అవుతారు అనే ఉద్దేశ్యంతో వాయిదా వేయడం జరిగింది. ఈనెల 18వ తారీకు నుండి ఏపీలో ఆంక్షలు అన్ని మొదలు కాబోతున్నాయి. తద్వారా ఏపీలో థియేటర్లు రోజుకు మూడు ఆటలే నడుస్తాయి.. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక మళ్లీ పరిస్థితులు కుదుట పడే వరకు సినిమాలు రాకపోవచ్చు అని అంతా భావిస్తున్నారు.
ఈ సమయంలో రిపబ్లిక్ డే కు రెండు సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అందులో ఒకటి డీజే టిల్లు కాగా మరో సినిమా గుడ్ లక్ సఖి . ఈ రెండు సినిమా లు కూడా రిపబ్లిక్ డే సందర్బంగా రాబోతున్నాయట. ఆంక్షలు ఉంటాయని తెలుసు.. ఆక్యుపేషన్ తక్కువ అని కూడా తెలుసు. అయినా కూడా ఆ రెండు సినిమాల మేకర్స్ థియేటర్ల ద్వారా తమ సినిమాను విడుదల చేసేదుకు గాను రిపబ్లిక్ డే ను వినియోగించుకోబోతున్నట్లుగా ప్రకటించారు. సంక్రాంతికే డీజే టిల్లు వస్తుందనే వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.
మంచి సంక్రాంతి సీజన్ ను వదిలేసిన డీజే టిల్లు మేకర్స్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని రిపబ్లిక్ డే కు విడుదల చేయాలని భావించడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లు సినిమాను సితార ఎంటర్ టైన్‌మెంట్స్ వారు నిర్మించారు. ఈమద్య కాలంలో వారి నుండి వచ్చిన పెద్ద చిన్న సినిమాలు మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. అందుకే డీజే టిల్లు కూడా తప్పకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. కాని సరైన సమయంలో సినిమా విడుదల కాకుంటే మాత్రం సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది.