Begin typing your search above and press return to search.
ఆహా... డీజే టిల్లు @ 10 మిలియన్స్
By: Tupaki Desk | 6 March 2022 4:30 PM GMTసిద్దు డీజే టిల్లుగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సినిమా మొదటి హాఫ్ ఫుల్ లెంగ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండి.. సెకండ్ హాఫ్ కాస్త డల్ అయినా ఓవరాల్ గా మాత్రం సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కింది. భారీ వసూళ్లను దక్కించుకున్న డీజే టిల్లు ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో బెస్ట్ సినిమాల్లో ఒక సినిమాగా నిలిచింది.
థియేటర్లలో యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న డీజే టిల్లు ఇప్పుడు ఆహా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొన్న శుక్రవారం నుండి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తును చూస్తున్నారు. ఓటీటీ ద్వారా కూడా ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ దక్కినట్లుగా ఓటీటీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ సినిమా ను ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసిన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ ల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా వెయిట్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈమద్య కాలంలో ఓటీటీ లో వెంటనే సినిమా లు స్ట్రీమింగ్ అవుతున్నాయి కనుక కొందరు థియేటర్ స్క్రీనింగ్ కు ఆసక్తి చూపడం లేదు.
డీజే టిల్లు ఎప్పుడెప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందా అంటూ ఎదురు చూశారు. థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లలో సాధ్యం అయినంత వసూళ్లు రాబట్టిన డీజే టిల్లు ఇప్పుడు ఆహా ఓటీటీ లో రచ్చ చేస్తున్నాడు. తన డీజే చప్పుడు తో దూమ్ ధామ్ చేస్తూ మాస్ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
టిల్లు పాత్రలో సిద్దు నటన ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ముఖ్యంగా అతడు మొదటి సగంలో పండించిన కామెడీకి ప్రతి ఒక్కరు కడుపు పట్టుకుని మరీ నవ్వారు అనడంలో సందేహం లేదు. అంతటి రెస్పాన్స్ థియేటర్ల ద్వారా వచ్చింది కనుకే ఇప్పుడు మళ్లీ ఓటీటీ లో కూడా అదే స్థాయి దక్కింది. కేవలం 48 గంటల్లో ఏకంగా 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకుంది అంటూ మామూలు విషయం కాదు. డీజే టిల్లుకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.