Begin typing your search above and press return to search.
అడవి శేషు పంథాలో 'డీజే టిల్లు' స్టార్!
By: Tupaki Desk | 8 Feb 2022 5:24 AM GMTయంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. నటుడిగా..రైటర్ గా..సింగర్ గా పరిణతి చెందుతూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సిద్దూ డే బై డే షైన్ అవుతూ హీరోగా ప్రమోట్ అయ్యాడు. అటుపై తనలో దాగిన అన్ని రకాల నైపుణ్యాల్ని బయటకు తీయడం మొదలు పెట్టాడు. `
గుంటూరు టాకీస్` సినిమాలో హీరోగా నటిస్తూనే డైలాగ్ రైటర్ గా... సింగర్ గాను రాణించాడు. అలా తొలి ప్రయత్నం సక్సెస్ అయింది. అటుపై `కృష్ణ అండ్ హిజ్ లీల`.. `మా వింత గాధ వినుమ` చిత్రాల్లోనూ తన ట్యాలెంట్ చూపించాడు. అయితే ఈ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సిద్దు ట్యాలెంట్ బయటకు రాలేదు.
ప్రస్తుతం `డీజే టిల్లు` అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సిద్దు రైటర్ గా పనిచేసాడు. ఇందులో హీరోగనే నటిస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ లతో నటనతో పాటు చక్కని డైలాగులతోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే.. మాటలు సిద్దునే రాసాడు.
దర్శకుడిగా తాను ఎంత చేసానో సిద్దు కూడా అంతే శ్రమించాడని `డీజే టిల్లు`కి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ తెలిపాడు. సిద్దు పెన్ పవర్ రిలీజ్ తర్వాత తెలుస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. అలాగే ఇందులో సిద్దు ఓ పాట కూడా పాడాడు. `నీకనులను చూశానే ఓ నిమిషం లోకం మరిచానే` అనే పాట పాడాడు.
ఈ పాటతో సిద్దు శ్రోతలకి మరింత దగ్గరవుతాడు. అయితే సిద్దు ఇలా ఫోకస్ అవ్వడానికి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ అత్యంతక కీలకంగా మారింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించడంతో సినిమా కి రీచ్ ఎ క్కువ దొరికింది.
సోషల్ మీడియా ప్రమోషన్ సహా సదరు నిర్మాణ సంస్థ గతంలో అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించడం వంటి అంశాలు సిద్దుని ఫోకస్ చేయడానికి పనికొచ్చాయి.
ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ `భీమ్లా నాయక్` చిత్రాన్ని నిర్మించడంతో `డీజే టిల్లు`కి బోలెడెంత ప్రచారం దొరుకుతుంది.
ఒకే నిర్మాత అగ్ర హీరోతోనూ..మీడియం రేంజ్ హీరోతోనూ సినిమా నిర్మించడం `డీజే టిల్లు`కి కలిసొస్తుంది. అంతకు ముందు అడవి శేషు కూడా ఇలాగా పరిచయమై ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. నటుడిగా..రైటర్ గా...నిర్మాతగా పరిశ్రమలో రాణిస్తున్నాడు.