Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: DJ టిల్లు రాత్రికి రాత్రి మహేష్ బాబు ఎట్లయితడు?
By: Tupaki Desk | 5 Sep 2021 12:11 PM GMTసిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `DJ టిల్లు`. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. నేహా శెట్టి కథానాయిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందే కథానాయకుడు సిద్ధు పాత్రను డీజే టిల్లుగా పరిచయం చేయగా ఆ పాత్రలోని ఫన్ టింజ్ ఆకట్టుకుంది. ఇప్పుడు టీజర్ రిలీజైంది.
టీజర్ ఆద్యంతం సిద్ధు ఆహార్యం అతడి నైజామ్ యాక్సెంట్ వండర్ ఫుల్ గా వర్కవుటైంది. ఫన్ రొమాన్స్ థ్రిల్స్ తో ఆద్యంతం టీజర్ కట్టిపడేసింది. ముఖ్యంగా నేహాశెట్టితో సిద్ధు ఆన్ రోడ్ రొమాన్స్ పోలీస్ ఛేజింగ్ వగైరా వగైరా మసాలా ఎలిమెంట్స్ మరింతగా కుర్రాళ్లకు కనెక్టయిపోతోంది. డీజే టిల్లు మామూలోడు కాదు.. రోడ్ సైడ్ కార్ ఆపినా.. నడిరోడ్డుపై వర్షం పడుతున్నా ఫుల్ మూడ్ లో ఉంటాడు. పబ్లిగ్గానే గాళ్ ఫ్రెండ్ తో లిప్ లాక్ లతో మెంటలెక్కిస్తున్నాడు.
డీజే టిల్లు మసాజ్ కోసం మంగలి సత్తి దగ్గరకు వెళ్లి ఓవర్ నైట్ లో మహేష్ లా కావాలంటాడు. ఆ ఇద్దరి సంభాషణ ఎంతో ఫన్ ని ఎలివేట్ చేసింది. కండలు పెంచాలని అద్దంలో చూసుకుని తిన్న ప్రొటీన్ అంతా ఏమైంది? అనుకునే టైపు టిల్లు లో రొమాంటిక్ యాంగిల్ ని ఈ టీజర్ ఆవిష్కరించింది. ముఖ్యంగా డీజే టిల్లు ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ రియల్లీ సూపర్భ్. ఈ సినిమాలో అతడి కాస్ట్యూమ్స్ ఒక పాత్రను పోషించాయని అర్థమవుతోంది. వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో మహంకాళి జాతరలో స్టెప్పులేసే వెరైటీ డీజేని ఇక్కడ తప్ప ఇంకెక్కడా చూడలేం మరి.
ఇంతకీ టిల్లు లైఫ్ జర్నీ ఎలా సాగింది? అతడి అంతిమ లక్ష్యం ఏమిటన్నది తెరపైనే చూడాలి. సిద్ధూ మేకోవర్ చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సత్యసాయి బాబాలా ఆ గిరజాల జుత్తు దానికి పక్క పాపిడి.. అతడి మాట తీరు యువతరానికి నచ్చుతుందనడంలో సందేహమేం లేదు. ఇక దర్శకుడిలో ఫన్ యాంగిల్ టింజ్ గురించి అతడు పాత్రను పోర్ట్రే చేసిన తీరును ప్రస్థావించాలి. ఆసక్తికరంగా ఇందులో ఎక్కడా అసభ్యకరమైన పదజాలం కానీ అనుచితమైన హాస్య సన్నివేశాలు కానీ కనిపించలేదు. ఇంతకుముందు జాతిరత్నాలు తరహాలోనే క్లీన్ జంధ్యాల కామెడీలా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీడివి ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.