Begin typing your search above and press return to search.
డీజే టిల్లు 2 అఫిషియల్ అప్‌డేట్..!
By: Tupaki Desk | 27 Sep 2022 7:39 AM GMTసిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా వచ్చిన డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న డిజే టిల్లు కి సీక్వెల్ ఉంటుందని సినిమాలోనే హింట్ ఇచ్చారు. సినిమాకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో వెంటనే సీక్వెల్ ని ప్రకటించారు.
సీక్వెల్ విషయమై చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ సీక్వెల్ కి వర్క్ చేయడం లేదని ముందే అధికారికంగా ప్రకటన వచ్చింది. స్క్రిప్ట్ ను స్వయంగా సిద్దు రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి దర్శకత్వం ఎవరు అంటూ నిన్నటి వరకు కూడా చర్చ జరిగింది. ఎట్టకేలకు ఈ సీక్వెల్ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.
సిద్దు జొన్నలగడ్డ మొదటి పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా రెండవ పార్ట్ ఉంటుందనే నమ్మకంను సన్నిహితుల వద్ద వ్యక్తం చేశాడట. సినిమా స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఎట్టకేలకు నిన్న రాత్రి నుండి షూటింగ్ ని ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ ను రెండు వారాల పాటు హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు.
డీజే టిల్లు 2 సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు. రాధిక పాత్ర కొనసాగుతుందా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. రాధిక పాత్ర కొనసాగితే నేహా శెట్టిని కంటిన్యూ చేస్తారా లేదంటే మరో హీరోయిన్ కి డీజే టిల్లు 2 లో ఛాన్స్ ఇవ్వబోతున్నారా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
శ్రీ లీలా మరియు అనుపమ పరమేశ్వరన్ ల పేర్లు ప్రచారం జరిగాయి కానీ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం డీజే టిల్లు 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది అనే విషయంలోనే స్పష్టత ఇచ్చారు. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. సితార వారు నిర్మిస్తున్న ఈ సీక్వెల్ మరీ ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.