Begin typing your search above and press return to search.
హిందీ వాళ్లకు మన భీమ్లా నాయక్ నచ్చుతాడా?
By: Tupaki Desk | 1 March 2022 6:51 AM GMTపవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ `భీమ్లా నాయక్`. అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చాలా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. కొనసాగుతున్న కరోనా క్రైసిస్.. టికెట్ ధరల సవరణలు వగైరా ఇబ్బందులు ఉన్నా భీమ్లా నాయక్ ప్రదర్శన ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
భీమ్లా నాయక్ హిందీ డబ్బింగ్ వెర్షన్ మార్చి 4న థియేటర్లలో విడుదల కానుందని తాజా సమాచారం. హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ గురించి నిర్మాతలు ఇంకా వ్యాఖ్యానించలేదు. అయితే ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం.
అమెరికాలో భీమ్లా హవా ఆ రేంజులో
పవన్ కళ్యాణ్ మానియా అమెరికాలోనూ ఒక రేంజులో సాగుతోంది. తాజా చిత్రం భీమ్లా నాయక్ ఇంటా బయటా దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 2 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించింది.
ఇప్పటికే USAలో 2 మిలియన్ల డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది. అంటే సుమారు 14కోట్లు వసూలు చేసింది. ఈ యాక్షన్ డ్రామా ఇండియన్ మూవీగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. US బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలతో సహా టాప్ 10 సినిమాలలో 6వ స్థానంలో నిలిచింది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో నిత్యా మీనన్- సంయుక్త మీనన్ కథానాయికలు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భీమ్లా మ్యూజికల్ గానూ ప్రేక్షకుల్ని మెప్పించింది. హిందీ వెర్షన్ భీమ్లా నాయక్ ప్రదర్శన ఎలా ఉంటుంది? అన్నది వేచి చూడాలి. అల్లు అర్జున్ పుష్ప.. అజిత్ వలీమై హిందీ వెర్షన్లు మెప్పించడం భీమ్లా నాయక్ కి కలిసి రానుందని అంచనా.