Begin typing your search above and press return to search.
అయ్యబాబోయ్... మీరనుకున్నంత తెలుగు నాకు రాదు
By: Tupaki Desk | 7 April 2019 12:51 PM GMTతెలుగు నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ బహుముఖ ప్రజ్ఝాశాలి. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నవాళ్ల కంటే ఎక్కువ లౌక్యం నేర్చేసుకున్నారు. అతని నటన, సినిమాలు చూసిన వారు విషయం ఉన్నవాడే అని మెల్లగా గమనించడం మొదలుపెట్టారు. కానీ అనతికాలంలో మంచి నటుడిగా మెప్పుకుంది. వరుసగా రెండు సినిమాలతో అందరి మది దోచుకున్నాడు.
అయితే, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతనికి ఎంత లౌక్యం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఏమండీ మిమ్మల్ని అందరూ ఆధునిక జంధ్యాల అంటున్నారు అంటే... ఆ పెద్దాయనతో పోల్చినందుకు చాలా సంతోషం కానీ... ఆ పొగడ్తను నేను స్వీకరించలేను. దానికి నేను అర్హుడిని కాదు అంటూ చాలా సమయస్ఫూర్తితో కూడిన సమాధానం ఇచ్చారు. అందులోనే అతని నేర్పరితనం బయటపడింది.
నాకు తెలుగు అందరూ అనుకున్నంత రాదు. నేను చాలా తప్పులు చేస్తుంటాను. కొందరు గమనించి చెబుతుంటారు. అపుడు సరిచేసుకుంటాను. జంధ్యాల మహానుభావుడు తెలుగులో ఆయనతో నన్ను పోల్చడం ఆయనను తగ్గించినట్టు అవుతుంది అంటూ వివరించారు. కానీ ఏమాటకామాటే... అతడి సినిమాల్లో మాటలు బాగుంటాయి. అందరినీ ఆకట్టుకున్నాయి.
ఒకవైపు ఇతరుల పొగడ్తలు వద్దంటూనే తన టాలెంటు గురించి చెప్పుకున్నారు. నేను దర్శకుడు అవుతానని కొందరికి చెప్పాను. వారు నమ్మలేదు. నువ్వింత సాఫ్ట్‌గా ఉంటావు.. దర్శకత్వం చేయలేవేమో అన్నారు. ఇపుడు ప్రూవ్ అయ్యిందిగా అంటూ నవ్వేశారు. అసలు సినిమాల్లోకి రావడం వెనుక నా లక్షమే దర్శకుడిగా ఎదగాలని అని అవసరాల అన్నారు. అనుకున్నది సాధించాను అన్న సంతృప్తి ఉందన్నారు.