Begin typing your search above and press return to search.
‘అవతార్-2’పై మనకున్న క్రేజ్ వాళ్లకు లేదా?
By: Tupaki Desk | 14 Dec 2022 5:30 PM GMTఇండియాలో ప్రస్తుతం సినీ ప్రేమికుల దృష్టి మొత్తం ‘అవతార్-2’ మీదే ఉంది. ఈ సినిమా కోసం కోట్లాదిమంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టెక్నికల్‌గా బాగా అప్డేట్ అయి ఉన్న థియేటర్లలో, పెద్ద తెరల్లో సినిమా చూడాలని తహతహలాడుతున్నారు. మంచి స్క్రీన్లలో టికెట్లు పెడితే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.
‘అవతార్-2’ మీద మన వాళ్లలో ఉన్న ఆసక్తి, అంచనాలు చూసి ఈ వారం ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయట్లేదు. దాదాపుగా ఈ వారం ఇండియన్ బాక్సాఫీస్‌ను ‘అవతార్-2’కు రాసిచ్చేశారనే చెప్పాలి. మన దగ్గర అంత హైప్, క్రేజ్ కనిపిస్తుంటే.. ‘అవతార్-2’ కేంద్ర స్థానం అయిన అమెరికాలో ఈ సినిమాకు అంతగా క్రేజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘అవతార్-2’ యుఎస్ ప్రి సేల్స్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తాయని.. సరికొత్త రికార్డులు నెలకొల్పుతాయని ఆశించారు.
కానీ ఇటీవలే విడుదలైన ‘బ్లాక్ పాంథర్-వాఖండ ఫరెవర్’తో పోలిస్తే ‘అవతార్-2’ ప్రి సేల్స్ తక్కువగా ఉండడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘అవతార్-2’ విషయంలో ముందు నుంచి యుఎస్ ప్రేక్షకులు కొంచెం నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. దీని రెండు ట్రైలర్లకు కొంచెం మిశ్రమ స్పందనే వచ్చింది అక్కడ.
దీనికి తోడు తాజాగా ‘అవతార్-2’కు ప్రిమియర్ షో వేయగా.. దానికి అంత మంచి టాక్ రాలేదు. ఆ షోకు వెళ్లిన వారిలో చాలామంది మిశ్రమానుభూతిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రబావమే ‘అవతార్-2’ ప్రి సేల్స్ మీద పడ్డట్లుంది. ‘అవతార్-2’ సరిగా ఆడకపోతే ముందు ప్రకటించినట్లు ‘అవతార్-4’, ‘అవతార్-5’ ఉండవని జేమ్స్ కామెరూన్ అన్నపుడు తన సినిమా మీద ఆయనకు కాన్ఫిడెన్స్ లేదా అన్న చర్చ నడిచింది. తాజా పరిణామాలు ‘అవతార్-2’ సక్సెస్ మీద సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ నెల 16న వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.