Begin typing your search above and press return to search.
జనాలు ఇదేమన్నా కొత్త సినిమా అనుకున్నారా..?
By: Tupaki Desk | 9 Sep 2022 6:32 AM GMTఇప్పుడు టాలీవుడ్ లో 'స్పెషల్ షో'ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి కెరీర్ లో క్లాసిక్స్ లేదా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోలో కాకుండా దేశ విదేశాల్లోనూ భారీ ఎత్తున స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'అతడు' మరియు 'పోకిరి' సినిమాల స్పెషల్ షోలు వేసిన సంగతి తెలిసిందే. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు 'జల్సా' & 'తమ్ముడు' చిత్రాలను ప్రదర్శించారు. ఇదే క్రమంలో గురువారం (సెప్టెంబర్ 8) నిర్మాత నట్టి కుమార్ బర్త్ డే కావడంతో "3" వంటి ప్లాప్ సినిమా స్పెషల్ షోలు వేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు శ్రుతి హాసన్ జంటగా నటించిన చిత్రం '3'. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగులో నట్టి కుమార్ రిలీజ్ చేశారు. 2012 లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
'కొలవెరిడి' పాట వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో "3" సినిమాకు మంచి హైప్ వచ్చింది. అయితే అంచనాలు అందుకోలేక చతికిల పడిపోయింది. తెలుగు తమిళ రెండు భాషల్లోనూ ఘోర పరాజయం చవిచూసింది.
భారీ నష్టాలు రావడంతో నిర్మాత నట్టి కుమార్ '3' మేకర్స్ పై గొడవకు కూడా దిగారు. అధిక రేట్లకు అమ్మిన ఐశ్వర్య తమకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చిన ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ గా ప్రదర్శించారు.
నట్టి కుమార్ బర్త్ డే కావడం.. సినిమా వచ్చి దశాబ్దం అవుతున్న సందర్భంగా స్పెషల్ షోలు వేశారు. అయితే వీటికి తెలుగు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. 300 లకు పైగా షోలు వేస్తే.. దాదాపు అన్నీ హౌస్ ఫుల్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
ముందుగా హైదరాబాద్ లో 75 షోలు ప్లాన్ చేయగా.. బుకింగ్స్ చూసి షోల సంఖ్య పెంచుకుంటూ పోయారు. 'పోకిరి' 'జల్సా' సినిమాలకు ఎలాంటి స్పందన వచ్చిందో.. అదే స్థాయిలో ఈ డిజాస్టర్ సినిమా టికెట్ల కోసం ఎగబడ్డారు. తమిళ్ లో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం గమనార్హం.
ఇది చూస్తుంటే ధనుష్ - శృతి హాసన్ కలిసి నటించిన కొత్త సినిమా అనుకున్నారేమో అనే సందేహాలు కలగకమానవు. ఇక థియేటర్లలో '3' సినిమా చూస్తూ ప్రేక్షకుల హంగామా చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు. "వండర్ ఆఫ్ వండర్స్.. '3' రీ రిలీజ్ గ్రాండ్ ఓపెనింగ్ రాబట్టింది. నట్టి కరుణ - నట్టి క్రాంతి మరియు నట్టి కుమార్ లకు కంగ్రాట్స్" అని ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొన్నారు.
నిజానికి '3' ప్లాప్ అయినప్పటికీ సినిమాలోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన ఈ సాంగ్స్ ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లే లిస్టులో ఉంటాయి. ఇక ఇందులో ధనుష్ - శృతి హాసన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ యూత్ ని బాగా ఆకర్షిస్తాయి. ఈ కారణాలతోనే ఈ సినిమా రీ రిలీజ్ కు అంత క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.
ధనుష్ ఇటీవల కాలంలో తెలుగులో పెద్దగా హిట్లు కొట్టలేకపోతున్నాడు. తమిళ్ లో సక్సెస్ అయిన 'తిరు' సినిమా ఇక్కడ ప్లాప్ అయింది. అయినప్పటికీ 'సార్' చిత్రంతో నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు ధనుష్. ఇప్పుడు '3' సినిమా స్పెషల్ షోలకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. 'సార్' కు పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.