Begin typing your search above and press return to search.

మేకర్స్ రిక్వెస్ట్ గురించి 'ఆర్.ఆర్.ఆర్' హీరోలు ఆలోచిస్తారా..?

By:  Tupaki Desk   |   11 Aug 2020 9:50 AM GMT
మేకర్స్ రిక్వెస్ట్ గురించి ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఆలోచిస్తారా..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఆర్.ఆర్.ఆర్'. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా.. తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ జరుపుకున్న 'ఆర్.ఆర్.ఆర్' కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది.

కాగా కరోనా తీవ్రత రోజురోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ షూటింగ్ స్టార్ట్ చేయలేకపోయారు. దీంతో ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ సినిమా రిలీజ్ అయినా గతంలో మాదిరి ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారనేది అనుమానమే. ఈ క్రమంలో భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా లేదా అనే ఆలోచన మొదలైంది. దీంతో ఇప్పటికే ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్స్ కి కొనుక్కున్న వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారట.

ఈ నేపథ్యంలో కొందరు బయ్యర్లు ఇచ్చిన అడ్వాన్స్ లో కొంత భాగం వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుండగా.. మరికొందరు ఇచ్చిన దానితోనే సరిపెట్టుకోమని.. క్రైసిస్ టైంలో ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేమని అంటున్నారట. దీంతో హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకొని బడ్జెట్ ని తగ్గించమని.. అలా కుదరకపోతే హీరోలనే నిర్మాతలుగా మారమని 'ఆర్.ఆర్.ఆర్' ప్రొడ్యూసర్ కోరుతున్నాడట. ఈ పరిస్థితి ఒక్క 'ఆర్.ఆర్.ఆర్' మూవీనే కాకుండా మిగతా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఎదుర్కుంటున్నాయట. మేకర్స్ అందరూ నష్టాలు చవి చూడకుండా ఉండేందుకు మార్గాలు వెతుకుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.