Begin typing your search above and press return to search.
బాడీ బిల్డింగ్ కోసం స్టార్లు స్టెరాయిడ్లు వాడతారా?
By: Tupaki Desk | 22 May 2021 6:03 AM GMTభారీ పాన్ ఇండియా సినిమాలు.. బహుభాషా మల్టీస్టారర్లతో స్టార్లకు ఎదురవుతున్న సవాళ్ల గురించిన చర్చ సాగిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడతాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్లతో సినిమాల్లో నటించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కోట్లాది రూపాయల డీల్స్.. వాటితో ముడిపడిన బిజినెస్ మేన్ ల జీవితాలు ఓవర్ నైట్ మారిపోతాయి. సినిమాలకు పని చేసే లేదా పెట్టుబడులు పెట్టే అందరినీ నిలబెట్టాలి.
అలా చేయాలంటే దానికోసం స్టార్ హీరోలు తమను తాము చాలా మార్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే మలుచుకోవాలి. దానికోసం చాలానే శ్రమించాల్సి ఉంటుంది. ఇక తెరపై నిండైన రూపం.. కండలు మెలితిరిగిన దేహధారుడ్యాన్ని స్టార్ హీరోలు ఆవిష్కరించాలి. లేదంటే నేటి మోడ్రన్ ట్రెండ్ లో ప్రజలకు ఆ హీరోలు నచ్చడం లేదు. అందుకే ఇటీవలి కాలంలో మన స్టార్ హీరోలంతా జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ డైట్ పాటిస్తూ సమయానికి కంటికి కునుకు కరువై చాలా ప్రయాసలు పడుతున్నారు.
అయితే స్టార్లు బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్లు వాడతారా? అన్న సందేహలు వ్యక్తమవుతుంటాయి. కొందరు జిమ్ కోచ్ లు డాక్టర్ల సమక్షంలో ఇవి చాలా కామన్ గా వినియోగిస్తారని చెబుతారు. అయితే టాలీవుడ్ లో మెజారిటీ హీరోలు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. సహజంగానే బాడీ బిల్డింగ్ చేసేందుకు ఇష్టపడతారని చెబుతుంటారు. విరివిగా కార్బో హైడ్రేట్ లు ఉండే మంచి ఆహారం తీసుకుని సహజ పద్ధతుల్లోనే బాడీ బిల్డింగ్ ని ప్రయత్నిస్తున్నారు.
టాలీవుడ్ లో బాలీవుడ్ లో డజన్ల కొద్దీ కండరగండళ్లు ఉన్నారు. అయితే మన కల్చర్ తో పోలిస్తే.. బాలీవుడ్ లో వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో అడ్వాన్స్ డ్ థింకింగ్ ఉంటుందని కూడా చెబుతుంటారు.
టాలీవుడ్ లో ఓ ప్రముఖ హీరో వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అలాగని సినిమాల కోసం కండలు పెంచే ఆయన స్టెరాయిడ్లు వాడేందుకు తప్పుడు విధానంలో శరీరాన్ని మలిచేందుకు అస్సలు ఇష్టపడరని తెలిసింది. కండరాలతో శరీరాలను నిర్మించడానికి స్టెరాయిడ్లు లేదా మరే ఇతర సప్లిమెంట్లను తీసుకోవడం లేదని ఆయన సన్నిహిత నటుడు వెల్లడించారు.
నిజానికి ఇలాంటి జాగ్రత్త చాలా అవసరం. స్టెరాయిడ్స్ వల్ల దీర్ఘ కాలంలో సమస్యలుంటాయి. ఇప్పుడు కరోనా చికిత్స కోసం ఉపయోగిస్తున్న స్టెరాయిడ్లు వికటిస్తున్న వైనం బయటపడుతోంది. అందుకే మన స్టార్లు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారనే భావిద్దాం.