Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ ఏడవ తరగతి ప్రతిభ గురించి మీకు తెలుసా..!

By:  Tupaki Desk   |   12 April 2022 1:30 AM GMT
స్టార్‌ హీరోయిన్‌ ఏడవ తరగతి ప్రతిభ గురించి మీకు తెలుసా..!
X
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే స్టార్‌ హీరోయిన్స్‌.. ఆ కొద్ది మంది స్టార్‌ హీరోయిన్స్ లో అతి కొద్ది మంది మాత్రమే ప్రతిభ కలిగిన హీరోయిన్స్ ఉంటారు. కొందరు అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్ గా అయిన వారు ఉంటారు. ప్రతిభతో హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమా కుటుంబ నేపథ్యంలో పెద్దగా లేకున్నా కూడా తన తండ్రి బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయినా కూడా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లు దక్కించుకుంది. బ్యాడ్మింటన్‌ లో మంచి ప్రావిణ్యం ను సాధించిన దీపిక పదుకునే అనూహ్యంగా ఓం శాంతి ఓం సినిమా తో బాలీవుడ్‌ లో ఏకంగా బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుఖ్ ఖాన్ తో నటించి ఎంట్రీ ఇచ్చే అవకాశం ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపిక పదుకునే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్వీర్‌ సింగ్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఈఅమ్మడు అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మతి పోగొట్టే విధంగా చేస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇప్పటి వరకు దీపిక పదుకునే అంటే ఒక స్టార్‌ హీరోయిన్ గా అందరికి తెలుసు.. కొందరికి మాత్రం ఆమె ఒక బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అని కూడా తెలుసు. కాని కొందరికి కూడా ఆమెలో ఒక మంచి రచయిత్రి ఉందనే విషయం తెలియదు. ఆ విషయాన్ని స్వయంగా దీపిక సోషల్‌ మీడియా ద్వారా రివీల్‌ చేసి అందరినా ఆశ్చర్యపర్చింది.

స్కూల్‌ లో 7వ తరగతి చదువుతున్న సమయంలో దీపిక పదుకునే కి ఐ యామ్‌ అనే పదాలను ఉపయోగించి కవిత రాయాల్సిందిగా టీచర్‌ అసైన్మెంట్‌ ఇచ్చిందట. ఆ అసైన్మెంట్‌ ను దీపిక ఎలా పూర్తి చేసింది అంటే అందరూ ఆశ్చర్యపోయేలా అనడంలో సందేహం లేదు. ఏడవ తరగతి అంటే కనీసం కవిత అంటే కూడా చాలా మంది పిల్లలకు తెలియదు. కాని ఆ సమయంలోనే దీపిక పదుకునే కవిత రాసింది.

ఐయామ్ లవ్ అండ్ కేర్‌ హ్యావ్ చైల్డ్‌ అంటూ కవిత మొదలు పెట్టి చక్కని పదాలను ఉపయోగించి అద్బుతమైన సాహిత్యంను ఆమె రాసిందట. ఆ విషయాన్ని తనకు తాను చెప్పుకొచ్చింది. ఆ కవితను సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేయడం తో అది కాస్త వైరల్‌ అయ్యింది. అదే నా మొదటి మరియు చివరి కవిత అన్నట్లుగా దీపిక పదుకునే చెప్పుకొచ్చింది.

ఏడవ తరగతిలో ఎంకరేజ్ చేసినట్లుగా స్కూల్‌ లో కాని ఇతర ఉన్నత చదువులు చదివిన కాలేజ్ ల్లో ఎంకరేజ్ చేయలేదు అంటూ దీపిక పదుకునే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడవ తరగతిలోనే అంత ప్రతిభ కలిగి ఉన్న దీపిక పదుకునే ను ఆమె టీచర్లు ఎంకరేజ్ చేసి ఉంటే మంచి కవిగా దీపిక పదుకునే నిలిచేది అంటూ కొందరు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.