Begin typing your search above and press return to search.
సాయిధరమ్ తేజ్ వాడిన ట్రయంఫ్ బైక్ గురించి మీకు తెలుసా?
By: Tupaki Desk | 11 Sep 2021 2:14 PM GMTసాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తెలుగు మీడియా ఛానెళ్లకు మంచి వార్త సరుకుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. యాక్సిడెంట్ నుంచి మొదలుపెడితే దీని చట్టూ అల్లుకున్న పుట్టుపుర్వత్రాలన్నింటిని మీడియా వెలికి తీయడం ప్రారంభించింది.. హైటెక్ సిటీ సమీపంలో శుక్రవారం సాయంత్రం నటుడు సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డుపై ఇసుక కారణంగా సాయిధరమ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయ్యి పడిపోయాడని పోలీసు అధికారులు వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగింది మొదలు.. టీవీ ఛానెళ్లలో ప్రమాదం ఎలా జరిగిందనే దాని చుట్టూ కథనాలు అల్లుతూ కథలు కథలుగా వల్లెవేస్తున్నారు.
నిన్న రాత్రి ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత పోలీసు అధికారులు బైక్‌ను రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్ 700 సిసి ఇంజిన్‌తో రూపొందించిన ‘ట్రయంఫ్ ఆర్ఎస్’ బైక్‌ను డ్రైవ్ చేస్తూ ఈ ప్రమాదానికి గురయ్యాడు. కానీ, సాయిధరమ్ ఈ బైక్ ను ట్రిపుల్ ఇంజిన్‌తో 1160cc కి అప్‌గ్రేడ్ చేశాడని విచారణలో తేలినట్టు సమాచారం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ట్రయంఫ్ బైక్ హైవేలపై డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. మన హైదరాబాద్ రోడ్లపై అసమాన ట్రాఫిక్‌లో నడపడం మంచిది కాదని సూచిస్తున్నారు. బైక్ టైర్లు ఫ్లాట్‌గా ఉన్నందున, రైడర్ వెంటనే వాహనాన్ని కంట్రోల్ చేయలేడని.. సాయిధరమ్ కూడా అందుకే స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడని నివేదికలు చెబుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ నాలుగు నెలల క్రితం ఈ బైక్ కొన్నాడు. ట్రయంఫ్ బైక్ తాజా వెర్షన్ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. అతను కష్టపడి సంపాదించిన డబ్బుతో ముచ్చటపడి ఈ బైక్ ను కొన్నాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. స్పోర్ట్స్ బైక్ లు అంటే సాయిధరమ్ కు చాలా ఇష్టమని అంటున్నారు.
సాయి ధరమ్ హెల్మెట్ ధరించినందున, అది అతడిని తీవ్రమైన గాయాల బారి నుండి కాపాడిందని పోలీసులు చెబుతున్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం.. ఈ బైక్ ధర 10 లక్షలకు పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.