Begin typing your search above and press return to search.

అమీర్ కుమార్తె ప్రియుడిలో ఆ స్పెష‌ల్ క్వాలిటీస్ గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   17 July 2021 9:30 AM GMT
అమీర్ కుమార్తె ప్రియుడిలో ఆ స్పెష‌ల్ క్వాలిటీస్ గురించి తెలుసా?
X
మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ త‌న జిమ్ కోచ్ నుపుర్ శిఖారేతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌కు ఇరా ఖాన్ వివ‌రించింది. ఇప్ప‌టికే నుపూర్ కుటుంబంలో క‌లిసిపోయిన ఇరా ఖాన్ త‌న‌తో రొమాంటిక్ డేట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తున్నారు.

ఇరా తాజాగా తన ప్రియుడు నుపూర్ శిఖారేతో కలిసి ఉన్న‌ సూపర్ క్యూట్ రొమాంటిక్ ఫోజును షేర్ చేయగా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇరా తన ప్రొఫైల్ లో ఈ ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ ఇలా రాసింది. ``అతను అలాంటి డ్రామా బాజ్..! అంటూ ఫ‌న్నీ నోట్ ని ఇచ్చింది. ఆమె తన పోస్ట్ కు # లవ్ # కడిల్స్ మరియు # హాపీ పిల్ అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించింది. ``డ్రామేబాజ్? ఎవరు? నేను? నూహూ ... లేదు .. నోహూ ... మి? నోహూ ... లేదు ... సరే కావచ్చు.. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను`` అంటూ నుపూర్ రిప్ల‌య్ ఇచ్చారు.

ఇరా ఖాన్ -నుపూర్ శిఖారే ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తరచూ కనిపిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇరా సోషల్ మీడియాలో అతని గురించి ఒక ఆక‌ట్టుకునే విష‌యాన్ని ఇన్ స్టాలో వెల్ల‌డించారు. నుపుర్ ని `వాలెంటైన్` అని ఇరా పిలిచారు. అప్పుడే త‌మ ప్రేమ‌భావ‌న‌పై ఓపెన‌య్యారు ఇరా. నాటి నుంచి ఆ ఇద్ద‌రి ప్రేమాయ‌ణానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్య ఫౌండేషన్ ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఇరా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. యూరిపిడెస్ మెడియా థియేట‌ర్ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఇందులో హాజెల్ కీచ్ నామమాత్రపు పాత్రలో నటించారు. ఇది డిసెంబర్ 2019 లో భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రదర్శిత‌మైంది. అమీర్ ఖాన్ ఇద్దరు పిల్లలలో మొదటి భార్య రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్. అమీర్ త‌న రెండో భార్య నిర్మాత‌ కిరణ్ రావు నుంచి 15 సంవత్సరాల వైవాహిక జీవితం అనంత‌రం విడాకులను ప్రకటించారు. కొడుకు ఆజాద్ కు వారు తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇరా సంగీత విద్య‌న‌భ్యసించగా ద‌ర్శ‌క‌త్వంలోనూ రాణించే ఆలోచ‌న‌తో ఉన్నారు. ఆమె సోదరుడు జునైద్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. తన తండ్రికి అత‌డు చిత్రనిర్మాణంలో సహాయం చేస్తాడు.

నుపుర్ ఎవ‌రు?

నుపుర్ శిఖారే బాలీవుడ్ సర్కిల్స్ లో ఫేమ‌స్ జిమ్ కోచ్. ప‌ర్స‌న‌ల్ ట్రైన‌ర్. అత‌డు అమీర్ ఖాన్ కి అత‌డి కుమార్తె ఇరా ఖాన్ కి కోచ్ గా ప‌ని చేశారు. మాజీ విశ్వసుంద‌రి సుశ్మితా సేన్ కి అత‌డు ప‌ర్స‌న‌ల్ కోచ్. అలాగే ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల‌కు నుపూర్ శిఖారే వ్య‌క్తిగ‌త‌ శిక్ష‌కుడిగా కొన‌సాగారు. బాలీవుడ్ లో అతడికి అసాధార‌ణ పాపులారిటీ ఉంది. జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆట‌గాడిగానూ నూపుర్ ప‌లు ప‌థాకాలు సాధించాడు. మార్ష‌ల్ ఆర్ట్స్ లోనూ అత‌డికి నైపుణ్యం ఉంది. నుపుర్ త‌ల్లి ప్రీత‌మ్ శిఖారే ముంబైలో ప్ర‌ముఖ‌ డ్యాన్స్ టీచ‌ర్. ఇక డిస్నీ ఇండియా టీవీ రూపొందించిన అల్లాడిన్ టీవీ షోకి అత‌డు యాక్ష‌న్ ని కొరియోగ్రాఫ్ చేశారు.