Begin typing your search above and press return to search.
సన్నీతో అడివి శేష్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 13 May 2022 5:31 AM GMTసన్నీలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నటిగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడీమె నార్త్ తో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అలాగే అడివి శేష్ విషయానికి వస్తే.. 'సొంతం' మూవీతో సినీ రంగప్రవేశం చేసి 'కర్మ' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు.
ఆపై పలు చిత్రాల్లో విలన్ గా మరియు సహాయ నటుడిగా చేసిన అడివి శేష్.. 'క్షణం'తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ అనంతరం శేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ.. సన్నీతో అడివి శేష్ కి ఉన్న సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? నిజానికి ప్రత్యక్షంగా ఏమీ లేకపోయినా వీరిద్దరికి పరోక్ష సంబంధం ఉంది.
అదేంటంటే.. సన్నీ కారణంగానే అడివి శేష్ తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజర్'. సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ల ఇందులో హీరోయిన్లుగా నటించగా.. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైంది.
26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ అలరించబోతున్నాడు. కొద్ది రోజుల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ షురూ చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా అడివి శేష్ సాయీ మంజ్రేకర్ తో కలిసి 'ఆలీతో సరదాగా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్న శేష్.. తన పేరును మార్చుకోవడానికి పరోక్షంగా సన్నీలియోన్ నే కారణమంటూ కుండబద్దలు కొట్టేశాడు. 'నేను హైదరాబాద్ లో పుట్టాను, ఆమెరికాలో పెరిగాను. నా అసలు పేరు అడివి సన్నీ కృష్ణ. అయితే అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని పిలుస్తూ ఆటపట్టించేవారు. అందుకే అడివి శేష్‌గా పేరు మార్చుకున్నా' అని సరిదాగా చెప్పుకొచ్చారు.
అలాగే అమెరికాలో ఓ ఇండియన్ హీరో అవలేడని, అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి లాంటి పాత్రలే ఇస్తారని శేష్ చెప్పుకొచ్చాడు. ఇక చందమామ సినిమాలో ఒరిజినల్ హీరో తానే అని.. కానీ, రెండు రోజుల షూటింగ్ తర్వాత క్యారెక్టర్ సెట్ అవ్వకపోవడంతో తప్పుకున్నానని, అప్పుడు నవదీప్ ను తీసుకున్నారని అడివి శేష్ మరో కొత్త విషయాన్ని సైతం బయట పెట్టాడు.