Begin typing your search above and press return to search.

ఐశ్వర్య రాయ్ నిక‌ర ఆస్తి విలువ‌ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 12:30 AM GMT
ఐశ్వర్య రాయ్ నిక‌ర ఆస్తి విలువ‌ ఎంతో తెలుసా?
X
ఐశ్వర్య రాయ్ బచ్చన్ .. ద‌శాబ్ధాల పాటు అభిమానుల హృద‌యాల్లో నిలిచి ఉన్న పేరు ఇది. అందానికి అందం.. ప్ర‌తిభ.. మేధోత‌నం ప్ర‌పంచ‌వ్యాప్త ఫాలోయింగ్.. ఎదురేలేని హోదా.. ఇలా ఏ కోణంలో చూసినా ఐశ్వ‌ర్యారాయ్ ఉన్న‌తికి సాటి రారెవ‌రూ. వ‌య‌సు 50కి చేరువ‌లో ఉన్నా కానీ ఆ రూప‌లావ‌ణ్యంలో కించిత్ మార్పు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది. త‌న‌ను త‌న రూపాన్ని ఎప్ప‌టికీ ఆరాధించే వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్ర‌పంచ సుంద‌రిగా కిరీటం గెలుచుకుని రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా సినీప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్న ఐశ్వ‌ర్యారాయ్ ఇప్ప‌టికి ఎన్ని ఆస్తులు కూడ‌గ‌ట్టారు? త‌న ఆస్తుల నిక‌ర విలువ ఎంత‌? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఐసూ ఆస్తుల నిక‌ర‌ విలువ‌ రూ. 776 కోట్లు. త‌న‌కు అత్యంత విలువైన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ గా వెలిగిన రాయ్ గ్లోబల్ ఐకాన్ గా స్థిరపడింది. ప్రపంచం నలుమూలల నుండి భారీ అభిమానాన్ని పొందింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతగాను ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. సినిమాలు- బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లు- వ్యాపార పెట్టుబడులు - రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు వంటివి త‌న‌కు వివిధ ఆదాయ వనరులుగా ఉన్నాయి.

ఐశ్వర్యరాయ్ బచ్చన్ తాను తెలివైన వ్యాపారవేత్త అని పదే పదే నిరూపించుకుంది. త‌ను 'అంబీ' అనే కంపెనీలో ఏంజెల్ ఇన్వెస్టర్. ఇది ఎన్విరాన్ మెంటల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ లో ఆమె రూ. 1 కోటి పెట్టుబడి పెట్టారు. ఆమె ఆకట్టుకునే పెట్టుబడి పోర్ట్ ఫోలియోలో పాజిబుల్ అనే న్యూట్రిషన్ ఆధారిత హెల్త్‌కే ర్ స్టార్టప్ కూడా ఉంది. దీనికి తోడు ఐశ్వ‌ర్యారాయ్ గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూర్చింది. ఎకనామిక్ టైమ్స్ క‌థ‌నం ప్రకారం.. హెల్త్ కేర్ కంపెనీ 'పాజిబుల్' ఐశ్వ‌ర్యారాయ్ బచ్చన్ నుండి రూ. 5 కోట్ల నిధిని సేకరించింది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ 100 మిలియన్ డాలర్ల (టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం రూ. 776 కోట్లు) నికర విలువతో కూడిన ఆస్తుల‌తో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. రాయ్ బచ్చన్ ఎంత కష్టపడి పనిచేస్తుందో అంతే రిలాక్సింగ్ గా ఉంటుంది. అంతర్జాతీయ వెకేష‌న్లు... విలాసవంతమైన బసలు .. ఇతర అత్యంత ఖరీదైన ఆస్తులతో అల‌రారుతోంది. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పొందే భారతీయ నటీమణులలో ఒకరిగా ఐశ్వ‌ర్యారాయ్ పేరు మార్మోగింది. ఆమె పాత్ర నిడివిని బట్టి ప్రతి సినిమాకు రూ. 10-రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొన్ని అతిపెద్ద బ్రాండ్ లకు అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతోంది. సంవత్సరాలుగా నటి ప్ర‌ఖ్యాత L'Oréal - స్విస్ లగ్జరీ వాచ్ లాంగిన్స్ తో అనుబంధం కలిగి ఉంది. ప్ర‌ముఖ మీడియా ప్రకారం త‌న‌కు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ల నుండి సంవత్సరానికి దాదాపు రూ. 80 నుండి 90 కోట్లు సంపాదిస్తుంది. ఒక రోజు క‌మిట్ మెంట్ కోసం రూ. 6-7 కోట్లు వసూలు చేస్తుంది. సంవత్సరాలుగా- స్టార్ LUX- నక్షత్ర డైమండ్ జువెలరీ.. కోకా-కోలా- లోధా గ్రూప్- పెప్సీ- టైటాన్ వాచెస్- లాక్మే కాస్మెటిక్స్- క్యాసియో పేజర్- ఫిలిప్స్- పామోలివ్- క్యాడ్ బరీ- ఫుజి ఫిల్మ్స్- కళ్యాణ్ జువెలర్స్ వంటి అనేక బ్రాండ్ లకు అంబాసిడ‌ర్ గా ఐశ్వ‌ర్యారాయ్ ఉన్నారు. డి బీర్స్ డైమండ్స్- ఎలిగాన్స్ - TTK ప్రెస్టీజ్ గ్రూప్ వంటి వాటికి బ్రాండ్ ప‌బ్లిసిటీ చేస్తూ ఆర్జిస్తోంది.

రియల్ ఎస్టేట్ ఆస్తులు అపారం ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు- అభిషేక్ బచ్చన్ తల్లిదండ్రులు... కుమార్తె ఆరాధ్య బచ్చన్ లతో కలిసి జల్సా అనే బంగ్లాలో నివసిస్తున్నారు. నగరం లో ప్రధాన ల్యాండ్ మార్క్ లలో ఇది ఒకటి. జల్సా ముంబైలోని జుహు పరిసరాల్లో ఉంది. మిడ్-డేలో వచ్చిన నివేదిక ప్రకారం దీని విలువ రూ. 112 కోట్లు. దీనితో పాటు దుబాయ్ లోని సంపన్నమైన జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లోని శాంక్చురీ ఫాల్స్ లో ఐష్‌-అభిషేక్ లు రాజభవన విల్లాను కూడా కలిగి ఉన్నారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ శక్తివంతమైన రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియోను కలిగి ఉన్నారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) వద్ద ఉన్న హై-ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రూ. 21 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ని కలిగి ఉన్నారు. 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ను చ.అ.కు రూ. 38000 ధరకు కొనుగోలు చేశారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ లగ్జరీని అనేక‌ మార్గాల్లో పునర్నిర్వచించాలి. గ్లోబల్ స్టార్ తన గ్యారేజీలో పార్క్ చేసిన లగ్జరీ కార్ల సముదాయాన్ని కలిగి ఉంది. ప‌ది కార్లు పైనే ఉన్నాయి. వీటిలో రూ. 7.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ - రూ. 1.60 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ S350d కూపే.... రూ. 1.58 కోట్ల ధర కలిగిన ఆడి A8L -లెక్స‌స్‌ LX 570 .. మెర్సిడెస్ బెంజ్ S500 వంటి టాప్ ఎండ్ కార్లు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.