Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ బ్యాచ్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 23 April 2022 2:30 AM GMTదక్షిణాది మునుపెన్నడూ లేనంతగా భారతీయ సినిమాలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. `బాహుబలి` నుంచి దక్షిణాది సినిమాపై దేశ వ్యాప్తంగా ఫోకస్ పెరిగింది. దీంతో ఇక్కడి నుంచి ఏ సినిమా వచ్చినా టాక్ ఆఫ్ ది ఇండియాగా మారుతోంది. బాహుబలి నుంచి కేజీఎఫ్ 2 వరకు దక్షిణాది నుంచి విడుదలైన ప్రతీ భారీ చిత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన `కేజీఎఫ్ చాప్టర్ 2` ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ భారీ వసూళ్లని రాబడుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 14న అత్యంత భారీ స్థాయిలో ఐదు భాషల్లో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
యష్ అద్భుతమైన నటన, ప్రశాంత్ నీల్ టెర్రిఫిక్ టేకింగ్, రవి బాస్రూర్ నేపథ్య సంగీతం.. భువన్ గౌడ ఫొటోగ్రఫీ.. ఇలా ప్రతీదీ సినిమాకు హైలైట్ గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండియాగా మార్చాయి. ఇప్పడు ఎవ్వరిని కదిపినా ఒక్కటే మాట కేజీఎఫ్ 2. అంతగా ఈ సినిమా యుఫోరియా జనాల్లో పీక్స్ కి చేరిపోయింది. ఇప్పటికే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ యూవీ ఇప్పటి వరకు 600 కోట్లకు పై చిలుకు వసూళ్లని రాబట్టి 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు ఉరకలు వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన `ట్రిపుల్ ఆర్` బడ్జెట్, రెమ్యునరేషన్ ల విషయంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పడు అదే విషయంగా `కేజీఎఫ్ 2` వార్తల్లో నిలిచింది. ట్రిపుల్ ఆర్ బడ్జెట్ 550 కోట్లు. ఇందులో రెమ్యుపరేషన్ లు చర్చకు దారితీశాయి. ఇదిలా వుంటే `కేజీఎఫ్ చాప్టర్ 2` బడ్జెట్ కేవలం 100 కోట్లే కావడం విశేషం.
ఇక ఈ రేంజ్ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి పని చేసిన వారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అన్న వివరాల్లోకి వెళితే... హీరో యష్ కు 25 కోట్ల వరకు పారితోషికం కింద ఇచ్చారట. ఇక అధీరా పాత్రలో నటించిన సంజయ్ దత్ కు 10 కోట్లు ఇవ్వగా రమికా సేన్ పాత్రలో నటించిన రవీనా టాండన్ కు 2 కోట్లు, హీరోయిన్ శ్రీనిధి శెట్టికి 3 కోట్లు, ప్రకాష్ రాజ్ కు 85 లక్షలు ఇచ్చారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా వండర్స్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కు రెండు పార్ట్ లకు గానూ 20 కోట్లకు పైన మాత్రమే దక్కినట్టుగా చెబుతున్నారు. ఈ ఫిగర్ లో మాత్రం మరింత సమాచారం తెలియాల్సి వుంది. ప్రశాంత్ నీల్ కు ఇది రెండవ సినిమా కావడం వల్లే అతనికి ఈ మాత్రమే దక్కిందని చెబుతున్నారు. ఈ సినిమాతో కన్నడ సినీ చరిత్రనే ప్రశాంత్ నీల్ సమూలంగా మార్చేసి టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యేలా చేశారని చెబుతున్నారు.