Begin typing your search above and press return to search.

పెళ్లిసందD బ్యూటీ వయసు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Jun 2022 6:32 AM GMT
పెళ్లిసందD బ్యూటీ వయసు ఎంతో తెలుసా?
X
పెళ్లిసందD సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన క్యూట్‌ బ్యూటీ శ్రీలీలా. ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇవ్వక ముందే ఇతర భాషల్లో అలరించింది. అక్కడ టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నిరాశ పర్చిన.. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా అనూహ్యంగా ఈ క్యూట్‌ బ్యూటీకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

తెలుగు లో ఈమె చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. హీరోయిన్ గా ఈ అమ్మడికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందమైన ఈ అమ్మడి వయసు గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అసలు విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

ఈ అమ్మడి వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే తెలుగు తో పాటు కన్నడం మరియు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు.. వారిలో చాలా మంది రెండు పదుల వయసు వచ్చేప్పటికి కనీసం ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు.

ఇరవై ఏళ్ల వయసులోనే ఈ అమ్మడు ఇంత బిజీ హీరోయిన్ అవ్వడం నిజంగా అదృష్టం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. క్యూట్‌ గా పక్కింటి అమ్మాయి అన్నట్లుగా కనిపించే ఈమె అందాల ఆరబోత విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఉంటుంది. మొత్తానికి రాఘవేంద్ర రావు స్కూల్‌ నుండి వచ్చిన ఈ అమ్మడికి టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది.

ధమాకా తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్న శ్రీ లీలా పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయా చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్‌ పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది.

నేడు సోషల్ మీడియాలో శ్రీ లీలా పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు సందడి చేస్తున్నారు. మా తరపున కూడా శ్రీ లీలాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.