Begin typing your search above and press return to search.
సంక్రాంతి సినిమాల బడ్జెట్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 12 Dec 2022 8:30 AM GMTసరిగ్గా నెల రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలు కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ద్వి భాష చిత్రం 'వారసుడు' రాబోతుంది. ఈ మూడు సినిమాలు కాకుండా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తునివు కూడా డబ్బింగ్ అయ్యి ఇక్కడ విడుదల కాబోతుంది.
ఈ నాలుగు సినిమాలతో ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ విషయానికి వస్తే.. అన్నింటి కంటే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా 'వారసుడు'. దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ కే వంద కోట్లకు పైగా పారితోషికం ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.
వారసుడు సినిమా తర్వాత అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు రూపొందించినట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి సినిమా ను 110 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందినట్లు సమాచారం అందుతోంది. ఇక అజిత్ నటించిన తునివు సినిమా కూడా వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందట.
మొత్తం నాలుగు సినిమాలు కూడా వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం జరిగాయి. కనుక సంక్రాంతికి ఈ పందెం కోళ్లు ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతాయో అచూడాలి. ఈ నాలుగు సినిమాలు కూడా మూడు రోజుల గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దాదాపుగా ఆరు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయట.
ఇప్పటికే ఈ సినిమాలన్నీంటి ప్రీ రిలీజ్ బిజీనెస్ లు పాజిటివ్ గా ఉన్నాయి. థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయట. కనుక మినిమం టాక్ దక్కించుకుంటే చాలు కలెక్షన్స్ భారీగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.