Begin typing your search above and press return to search.

దేవ‌ర‌కొండ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   8 Nov 2021 12:30 PM GMT
దేవ‌ర‌కొండ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా?
X
ప్ర‌స్తుతం రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన `పుష్ప‌క విమానం` ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. త‌మ్ముడితో క‌లిసి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు విజ‌య్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఒక ఎత్తైతే..ఎలాగైనా త‌మ్ముడ్ని కూడా త‌నంత‌టి వాడిని చేసి మార్కెట్ లోకి వ‌దలాల‌ని క‌సిగా పనిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో అన్న‌ద‌మ్ములిద్ద‌రు అన్ని మీడియా సంస్థ‌ల్ని చుట్టేస్తున్నారు. సినిమాకి కూడా పాజిటివ్ వైబ్స్ ఉండ‌టంతో మ‌రింత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. న‌వంబ‌ర్ 12న సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కూ రౌడీ షెడ్యూల్ అంతా బిజీనే.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఓ ఇంట‌ర్వ్యూల్లో త‌న‌కిష్ట‌మైన న‌టుల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. తెలుగులో అయితే సూప‌ర్ స్టార్ మ‌హేష్ ..హిందీలో అయితే ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న‌కిష్ట‌మైన న‌టులు అని అన్నారు. ఇక హాలీవుడ్ లో అయితే డేంజెల్ వాషింగ్ట‌న్.. మెరిల్ స్ట్రీప్ ల‌ను ఆరాధిస్తాను అని అన్నారు. అంతా బాగానే ఉంది. తెలుగు నుంచి ఇష్ట‌మైన హీరోల ఛాయిస్ అన‌గానే మెగా కాంపౌండ్ హీరోల పేర్లు చెబుతార‌ని అంతా ఆశించారు. కానీ రౌడీ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ఇక మెగా కాంపౌండ్ తో విజ‌య్ కి ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

విజ‌య్ కి అల్లు అర‌వింద్- అల్లు అర్జున్ ద్వ‌యం వెన్ను ద‌న్నుగా నిలుస్తారు. `టాక్సీవాలా` రిలీజ్ వివాదం స‌మ‌యంలో విజ‌య్ వెనుక నేను ఉన్నానంట అర‌వింద్ ముందుకొచ్చారు. అప్పుడే మెగా నిర్మాత‌తో విజ‌య్ అటాచ్ మెంట్ బ‌య‌ట ప‌డింది. ఆ త‌ర్వాత అల్లు అర్జున్...శిరీష్ తో క్లోజ్ మూవ్ మెంట్స్ క‌నిపించాయి. ఇటీవ‌లే `బ‌న్నీ అన్నా` అంటూ సంబోధించ‌డం..పుష్ప‌క విమానం ప్ర‌చారం కోసం బ‌న్నీ ని తీసుకురావ‌డం వంటింటి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య్ అభిమాన స్టార్ గా బ‌న్నీ పేరునో లేక ఇత‌ర హీరోల పేర్ల‌నో చెబుతార‌ని అంతా ఊహించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. అయితే అభిమానం వేరు.. స్నేహం వేరు! అని మ‌నం గ్ర‌హించాలేమో!