Begin typing your search above and press return to search.
వాల్తేరులో మాస్‌రాజా నిడివి ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 20 Dec 2022 3:30 PM GMTమాస్ మాహారాజా రవితేజ దాదాపు 22 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన `అన్నయ్య` మూవీలో తనకు తమ్ముడిగా నటించాడు. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `వాల్తేరు వీరయ్య`. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలోని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
కో ఇన్సిడెంటల్ గా ఈ మూవీ కూడా సంక్రాంతికే విడుదల కాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2023 జనవరి 13న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే `నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవినవుతా..` అంటూ సాగే ఫైనల్ సాంగ్ ని చిరు, శృతిహాసన్ లపై ఫ్రాన్స్ లోని మంచు అందాల మధ్య మైనస్ 8 డిగ్రీల చలిలో చిత్రీకరించారు. ఈ లిరికల్ సాంగ్ ని కూడా రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఊర మాసీవ్ పాత్రలో గల్లలుంగీ, చారల చొక్కా.. తలకు రూమాల్ ధరించి ముఠామేస్త్రీ లుక్ ని గుర్తు చేస్తూ కనిపించబోతున్నాడు. సినిమాలో చిరు, రవితేజ సవతి తల్లి సోదరులుగా కనిపించ బోతున్నారు. అంతే కాకుండా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ క్యారెక్టర్ నిడివి ఎంత? .. సినిమాలో రవితేజకున్న ప్రాముఖ్యత ఎంత? అనే చర్చ మొదలైంది.
తాజాగా రవితేజ క్యారెక్టర్ నిడివి ఎంత, ఎంత వరకు వుంటుంది. ఈ పాత్రకున్న ప్రాధాన్యత ఎంత అనే విషయాల్లో క్లారిటీ వచ్చేసింది. సినిమాలో రవితేజ క్యారెక్టర్ నిడివి 44 నిమిషాలని, అంతే కాకుండా చాలా పవర్ ఫుల్ సీన్ లలో మాత్రమే రవితేజ కనిపిస్తాడని, అన్నీ చిరు కాంబినేషన్ లోనే వుంటాయిని, ఇద్దరి కాంబినేషన్ లో `పూనకాలు లోడింగ్` అనే సాంగ్ కూడా వుంటుందని తెలిసింది. రవితేజ క్యారెక్టర్ దాదాపు గంట లోపు నిడివి వుండటంతో ఇది మల్టీస్టార్ అనుకోవచ్చనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.