Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ పెళ్లి చూపుల ప్రేమ కథ మీకు తెలుసా?
By: Tupaki Desk | 13 Jun 2021 11:30 AM GMTస్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెళ్లి పెద్దగా ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్యవహరించారు. రచయితగా అప్పుడప్పుడే సక్సెస్ ను దక్కించుకుని డైరెక్టర్ గా మారుతున్న సమయంలో త్రివిక్రమ్ పై చాలా నమ్మకంతో సిరివెన్నెల తన సోదరుడి కూతురును ఇప్పించేందుకు సిద్దం అయ్యాడు. అలా త్రివిక్రమ్ ను సిరివెన్నెల తీసుకు వెళ్లాడు. అక్కడ పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లిన అమ్మాయిని కాకుండా పక్కన ఉన్న ఆమె చెల్లెలును చూసి ఇష్టపడ్డాడట. ఇది కాస్త విడ్డూరంగా సినిమాటిక్ గా ఉన్నా కూడా దర్శకుడు త్రివిక్రమ్ పెళ్లి చూపులు కాస్త విభిన్నంగా జరిగినట్లుగా చెబుతున్నారు.
త్రివిక్రమ్ పెళ్లి చూపుల తర్వాత స్వయంగా వెళ్లి తాను పెళ్లి చూపులు చూసిన అమ్మాయిని కాకుండా ఆమె చెల్లి సౌజన్య ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పేశాడు. దాంతో వారు కూడా సరే అన్నట్లుగా పెద్దలు మాట్లాడుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాని పెద్ద అమ్మాయి పెళ్లి అయిన తర్వాత కాని తాము చిన్నమ్మాయి పెళ్లిని చేయాలని భావించడం లేదు అంటూ పేర్కొన్నారు.
సౌజన్య గారి అక్క గారి పెళ్లి అయ్యాక గాని త్రివిక్రమ్ పెళ్లికి సిద్దం అవ్వలేదు. వెయిట్ చేసి మరీ సౌజన్యను వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్ పెళ్లి ఫొటోలు చాలా అరుదుగా నెట్టింట కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. చాలా మంది త్రివిక్రమ్ ను చూసి భలే ఉన్నాడే అనుకుంటు ఉన్నారు. త్రివిక్రమ్ మరియు సౌజన్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్నారు.