Begin typing your search above and press return to search.
ఇన్ స్టాలో నంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 19 July 2021 11:30 AM GMTవ్వాటే బ్యూటీ రష్మిక మందన ప్రొఫెషనల్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్ వుడ్ అంటూ అన్ని పరిశ్రమల్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ బడా స్టార్ల చిత్రాల్లో నటిస్తూ చివరికి అక్కడే స్థిరపడిపోవాలని వెయిట్ చేస్తోంది. ఇలాంటి క్వాలిటీస్ రష్మికకు మరింత భారీ పాపులారిటీని తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఈ భామ ఇన్ స్టా ఫాలోవర్స్ రేంజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లనే వ్వాటే బ్యూటీ పక్కకు నెట్టేసింది.
అవును ఇప్పుడు ఇన్ స్టాలో రష్మిక 19.2 మిలియన్ల అనుచరులను కలగి ఉంది. అంటే కోటి 92 లక్షలు అన్నమాట. దాదాపు రెండు కోట్ల మంది ఫాలోవర్స్ ఒక్క ఇన్ స్టాలోనే కలిగి ఉంది. ఇప్పటివరకూ ఇన్ స్టాలో బాగా పాపులారిటీ కలిగిన భామగా చందమామ కాజల్ అగర్వాల్ పేరు మార్మోగింది. ఆమె 19 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉండేది. ఆ తర్వాత స్థానంలో కియారా అద్వాణీ 17.7 మిలియన్లు.. అక్కినేని కోడలు సమంత 17.5 మిలయన్ ఫాలోవర్స్ ని కలిగి ఉండేవారు. ఇప్పుడు వాళ్లందర్నీ రష్మిక వెనుకకు నెట్టి ఇన్ స్టా ఫాలోవర్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అలాగే వెండి తెర రొమాంటిక్ కోస్టార్ విజయ్ దేవరకోండని సైతం అమ్మడు పక్కకు నెట్టేసింది.
రష్మిక ఇన్ స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్స్ కల్గి ఉండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా బ్యూటీ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా చిత్రం `పుష్ఫ` లో.. కోలీవుడ్ లో `సుల్తాన్` లో నటిస్తోంది. బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`.. `గుడ్ బై` చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే తెలుగు చిత్రం కూడా కమిట్ అయింది.
హాలీవుడ్ కి వెళుతుందేమో!
ఇక రష్మిక కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. పరిశ్రమలో చాలామంది కథానాయికలతో పోలిస్తే ఈ బ్యూటీ వేగంగా సౌత్ పరిశ్రమలో పాపులరై అంతే వేగంగా బాలీవుడ్ లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ రష్మిక హవా సాగుతోంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఈ బ్యూటీ అట్నుంచి హాలీవుడ్ కి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో..!
ఆరంభం నాగశౌర్య `ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఆ వెంటనే మహేష్ సరసన `సరిలేరు నీకెవ్వరు` లాంటి మరో బ్లాక్ బస్టర్ లో నటించింది. మహేష్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం అందుకున్న ఈ బ్యూటీ నితిన్ సరసన భీష్మ లాంటి మరో బ్లాక్ బస్టర్ లోనూ నటించింది. ప్రస్తుతం బన్ని సరసన `పుష్ప` డ్యూయాలజీతో రష్మిక రేంజు మరో లెవల్ కి చేరనుంది.
నేషనల్ క్రష్ అయ్యింది అందుకే!
రష్మిక వైబ్రేంట్ పెర్ఫామెన్స్ కు కేవలం సౌత్ లోనే గాక నార్త్ లోనూ భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో పాటు మరోవైపు సోషల్ మీడియాల్లోనూ గొప్ప ఫాలోవర్స్ ని సంపాదించి చివరికి నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. అదే క్రమంలో జాతీయ ప్రాజెక్టులతో కెరీర్ పరంగా బిజీ అయ్యింది.