Begin typing your search above and press return to search.

అదితీ డిజైన‌ర్ లెహెంగా ధ‌ర తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   23 Dec 2020 6:30 AM GMT
అదితీ డిజైన‌ర్ లెహెంగా ధ‌ర తెలిస్తే షాకే
X
నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న `వి` చిత్రంలో న‌టించింది అదితీరావ్ హైద‌రీ. ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి `మ‌హా స‌ముద్రం` చిత్రంలో న‌టిస్తోంది. నాలుగు భాష‌ల్లో అదితీ బిజీ నాయిక‌. మ‌ల‌యాళంలో ఈ భామ న‌టించిన హిందూ-ముస్లిమ్ ప్రేమ‌క‌థా చిత్రం `సూఫీయుం సుజాత‌యుం` 2020 హిట్ గా నిలిచింది. ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్.. హే సినామిక చిత్రాల్లోనూ ఆడిపాడుతోంది. మ‌రోవైపు త‌మిళం హిందీలోనూ క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం.

ఇక అదితీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోనూ అంతే బిజీగా ఉంటోంది. అదితి రావు హైద‌రీ తాజా లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫేమ‌స్ డిజైన‌ర్ `సుకృతి అండ్ ఆకృతి` ఫుల్కరీ లెహెంగా లో అదితీ అందం మైమ‌రిపిస్తోంది. ఈ లెహెంగా ధ‌ర రూ.192640. డిజైనర్ ద్వయం సుకృతి అండ్ ఆకృతి గ్రోవర్ ఈ లెహంగాని రూపొందించారు.

లెహెంగాలో మ‌ల్టీక‌ల‌ర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ మిర్రర్ వర్క్ ఆక‌ర్ష‌ణ‌ను పెంచింది. స్లీవ్ లెస్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ .. మ్యాచింగ్ దుపట్టా అదితీ కి ప‌ర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. ఎంబ్రాయిడరీ పింక్ బేస్ మీద సున్నం ఆకుపచ్చ.. పసుపు.. పింక్ .. నీలం వంటి రంగులతో డిజైన‌ర్ వేర్ ప్ర‌త్యేక‌త‌తో క‌నిపిస్తోంది. ఈ లుక్ ‌ను సనమ్ రతన్సీ స్టైలింగ్ చేశారు.

అలాగే ఈ ఫోటోల్లో కిష్నాదాస్ అండ్ కో చంద్ సీతారా రూపొందించిన మాస్క్ ను ధరించి ఓ ఫోటోలో అదితి కనిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.