Begin typing your search above and press return to search.
రీల్ విరాటపర్వం వెనకున్న రియల్ స్టోరీ తెలుసా?
By: Tupaki Desk | 17 Jun 2022 6:30 AM GMTశుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. అయితే.. కరోనా తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహమ్మారికి ముందు శుక్రవారం నాటి పండుగ వాతావరణం ఇప్పుడు అంతగా లేదనే చెప్పాలి. అయినప్పటికీ కొన్ని సినిమాల విడుదల వేళ.. మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయి. తాజాగా అందరి నోట నానుతున్న మూవీ ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ.. ఎప్పటికిప్పుడు ఏదో ఒక ఇష్యూతో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు విడుదలైన ఈ మూవీకి సంబంధించిన రియల్ స్టోరీ తెలిస్తే.. ఈ సినిమాను అస్సలు మిస్ కారనే చెప్పాలి.
దగ్గుబాటి రాణా.. సాయి పల్లవి నటించిన ఈ మూవీలో రియల్ స్టోరీ. విప్లవ భావాలున్న ఒక మహిళ నక్సలైట్లతో కలిసి పని చేసేందుకు వెళ్లటం.. అయితే ఆమెను నక్సలైట్లు పోలీసు ఇన్ ఫార్మర్ అన్న అనుమానంతో కాల్చి చంపేస్తారు. స్థూలంగా ఉన్న ఈ కథ.. నిజంగా జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన సరళ అనే మహిళకు సంబంధించిన రియల్ స్టోరీ. ఆమె జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
రీల్ స్టోరీ ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే.. రియల్ స్టోరీకి వెళితే.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన స్వరాజ్యం.. భిక్షమయ్య గారాలపట్టి సరళ. తండ్రి వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. సీపీఐ ఆర్గనైజర్ గా పని చేసేవారు. వారి కుటుంబం ఇప్పటి భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ఉండేవారు. ఆ ఇంట్లో నాలుగో సంతానంగా పుట్టిన సరళ అంటే ఇంట్లోని వారందరికి గారాబం. అల్లారు ముద్దుగా ఆమెను పెంచారు. అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం వామపక్ష భావజాలంతో ఉండిపోవటంతో.. పిల్లల చదవుల కోసం ఖమ్మంకు వెళ్లిపోయింది సరళ కుటుంబం.
పేదరిక నేపథ్యంలో చుట్టూ ఉన్న ప్రజలు పడుతున్న బాధల్ని చూసిన సరళ.. ఎలాగైనా ఉద్యమంలోకి వెళ్లాలని.. నక్సలైట్లతో కలిసి పని చేయాలని భావిస్తుంది. ఇంటర్ పూర్తి కాగానే ఇంట్లో చెబితే వద్దంటారని.. వారికి చెప్పకుండా అడవి బాట పడుతుంది. అప్పటి పీపుల్స్ వార్ లో పని చేస్తున్న శంకరన్నను వెతుక్కుంటూ ఖమ్మం నుంచి నిజామాబాద్ అడవుల్లోకి వెళుతుంది. అయితే.. పీపుల్స్ వార్ నక్సలైట్లు మాత్రం సరళను పోలీస్ ఇన్ ఫార్మర్ అనుకొని చంపేశారు. ఇంట్లో నుంచి వెళ్లిన 35 రోజుల తర్వాత పీపుల్స్ వార్ విడుదల చేసిన లేఖలో సరళ చనిపోయిందన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు. దీంతో వారి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోతుంది.
సరళ జీవితం ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీశారు. అయితే.. సరళ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా సినిమాను ముందు ఎలాంటి మార్పులు చేర్పులు చెప్పలేదని సరళ సోదరుడు మోహన్ రావు చెప్పారు. సినిమాను తీసే విషయంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకూ మోహన్ రావు ఎవరంటే.. ప్రస్తుతం వరంగల్ లోని ప్రశాంతి ఆసుపత్రి ఛైర్మన్. అడవికి వెళ్లిన తర్వాత సరళ అనుభవించిన కష్టాల గురించి లోతుగా పరిశీలించి సినిమాను తీసినట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమాను థియేటర్ లో తమ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి చూడాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తమ చెల్లిని కాల్చి చంపిన వైనంపై క్షమాపణలు చెబుతూ పీపుల్స్ వార్ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తాజాగా రానా.. సాయి పల్లవితో కూడిన సినిమా టీం సభ్యులు సరళ కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఈ సందర్భంగా సాయిపల్లవిని చూసినంతనే వారి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేయటంతో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది.