Begin typing your search above and press return to search.

'అవతార్-2' రన్ టైం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   24 Oct 2022 9:55 AM GMT
అవతార్-2 రన్ టైం ఎంతో తెలుసా?
X
అమెరికన్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్'. 2009లో విడుదలైన 'అవతార్' మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మనిషి స్వార్థానికి.. గ్రహంతర వాసులకు మధ్య సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీ వీక్షకులను ఎంతగానో అలరించింది.

'అవతార్' సినిమా గ్రాఫిక్స్ పనితనానికి ఒక మచ్చుతునగా చరిత్రలో మిగిలిపోతుంది. 234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది. 'అవతార్' మొదటి పార్ట్ విడుదలైన సమయంలో ఈ మూవీకి నాలుగైదు సీక్వెల్స్ ఉంటాయని దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రకటించారు.

దాదాపు 13 ఏళ్ల తర్వాత 'అవతార్-2' రాబోతుంది. ఈ సినిమాను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'Avatar: The Way of Water' పేరుతో రాబోతున్న 'అవతార్-2'పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆసక్తిని కనబరుస్తున్నారు.

'అవతార్-2' విడుదల నేపథ్యంలో ఇటీవల 'అవతార్-1'మూవీని ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయగా తొమ్మిది మిలియన్ల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. దీనిని బట్టి 'అవతార్' మూవీ రేంజ్ ఏంటో తెలుస్తోంది. 'అవతార్-2' టీజర్ చూస్తే తొలి పార్ట్ మించిన గ్రాఫిక్ మాయాజాలం ఉండబోతుందని అర్థమవుతోంది.

'అవతార్-2' కోసం దర్శకుడు జేమ్స్ కామెరూన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 'అవతార్-2' రన్ టైమ్ సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు (162 నిమిషాలు) కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు (190 నిమిషాలు) ఉండబోతుందట. ప్రేక్షకులను ఎంతసేపైనా థియేటర్లలో కూర్చోబెట్టే సత్తా 'అవతార్-2'కు ఉండటంతో అదేమీ పెద్ద సమస్యగా కన్పించడం లేదు.

తెలుగులోనూ 'బాహుబలి' వంటి సినిమాలు 3 గంటల నిడివితో వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాయి. అయితే 'అవతార్-2' రన్ టైమ్ మాత్రం దర్శకుడు జేమ్స్ కామెరూన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదిఏమైనా ఈ మూవీ విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.