Begin typing your search above and press return to search.

మన టాప్ హీరోల బలహీనతలు ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   9 Jan 2020 4:16 AM GMT
మన టాప్ హీరోల బలహీనతలు ఏంటో తెలుసా?
X
తెలుగు సినిమా హీరోలంటే పడిచచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు. అద్భుత నటనతో తెరపై చెరగని ముద్రవేసి అభిమానుల ఆరాధ్య దైవాలుగా మారి పోయారు. తెరపై సూపర్ స్టార్ లుగా మెదిలే హీరోలందరూ తెరవెనుక సాధారణ మనుషులే.. వారికి మనలాగే కొన్ని ఇబ్బందులు, వీక్ నెస్ లు ఉన్నాయి. మన హీరోల బలహీనతలు అప్పుడప్పుడు బయటపడి విమర్శలపాలవుతుంటారు.. ఇప్పుడు ఆ హీరోలు ఎవరు..? వారి బలహీనతలు ఏంటో చూద్దాం..

నందమూరి బాలక్రిష్ణ.. ఈ ఎన్టీఆర్ నట వారసుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వెండి తెరపై యాంగ్రీ యంగ్ మ్యాన్ లో ఉండే బాలయ్యకు ముక్కు మీద కోపం ఎక్కువ. బాలయ్య జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటాడు. సినిమా షూటింగ్ అయినా.. ఏదైనా ఇంట్లో కార్యక్రమమైనా జాతకం చూసే వెళతారట..

ఇక మహేష్ బాబుకు ఒకప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఎక్కువగా ఉండేది.ఇప్పుడు మానేశారని అంటున్నారు. ఆ అలవాటు మానుకోవడానికి మహేష్ కు చాలా సమయమే పట్టింది. ఇవేకాకుండా మహేష్ కు మరో వీక్ పాయింట్ ఉంది. షూటింగ్ టైంలో సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే మహేష్ సహించరట.. అక్కడి నుంచి వెళ్లి పోతాడట..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై ఎంచక్కా రాజకీయం చేసుకుంటున్నారు. త్వరలోనే దిల్ రాజ్ నిర్మించే ‘పింక్’ రిమేక్ లో నటిస్తారని టాక్ నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు ఆది నుంచి సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి దర్శకత్వం వరకూ అన్నీ ఆయన పర్యవేక్షిస్తుంటారు. సన్నివేశాలు తేడా కొడితే అడిగి మరీ మళ్లీ తీయించే అలవాటు పవన్ కు ఉందట.. ఇక పవన్ కథలో తలదూర్చడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయని కొందరు దర్శకులు విమర్శలు కూడా పలుసార్లు చేశారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి వక్త. కానీ షూటింగ్ లలో ఎవ్వరైనా కొత్త వ్యక్తి వస్తే మాత్రం తెగ సిగ్గుపడతారట.. అలాగే మొహమాటం కూడా చాలా ఎక్కువ. ఇక ఎన్టీఆర్ షూటింగ్ లో ఉంటే అందరినీ తెగ ఆట పట్టిస్తుంటాడట.. చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తాడనే పేరుంది.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సిగ్గు ఎక్కువ.. పెద్ద పెద్ద సీన్లు చేసేటప్పుడు ఎవ్వరినీ సెట్ లో ఉంచనీయడట.. ఆ సీన్లు బాగా రావాలంటే తక్కువ మంది ఉంటేనే చేస్తాడట ప్రభాస్. షూటింగ్ సెట్ లో మాత్రమే అందరితో కలిసి ఉంటాడు. బద్దకం బాగా ఎక్కువట ప్రభాస్ కు.

ఇలా ఎంత పేరున్న హీరోలైనా సరే వారి వీక్ నెస్ లు, నమ్మకాలు ఎప్పుడూ పాటిస్తూనే ఉంటారట..