Begin typing your search above and press return to search.

RRR గురించి ఇవి మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   23 March 2022 1:30 AM GMT
RRR గురించి ఇవి మీకు తెలుసా?
X
ఇండియ‌న్ సినీ హిస్ట‌రీని `ఆర్ ఆర్ ఆర్` తిరిగి రాయ‌బోతోందా? అంటే ట్రేడ్ వ‌ర్గాలు అత్య‌ధిక శాతం మంది అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇప్ప‌టికే అన్ని భాష‌ల్లో క్రేజ్‌ని సొంతం చేసుకున్న `ఆర్ ఆర్ ఆర్‌` మ‌రో మూడు రోజుల్లో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలకు తెర లేప‌బోతోంది.

`బాహుబ‌లి` త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే సినిమాలోనూ చాలా ప్ర‌త్యేక‌త‌లున్నాయ‌ని తెలుస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిల‌వ‌బోతోంది.

మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డికి రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చి ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 300 రోజుల వ‌ర్కింగ్ డేస్ లో హైద‌రాబాద్‌, పూనే, ఉక్రెయిన్ లో షూట్ చేశారు. అంతే కాకుండా ప్ర‌ధాన ఎపిసోడ్ ల‌ని హైద‌రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ ల‌లో పూర్తి చేశారు. ఈ మూవీ కోసం 100 ఏక‌రాల‌కు మించి లీజుకు తీసుకుని ఈ మూవీని రూపొందించారు.

రాజ‌మౌళి, అత‌ని ఫ్యామిలీ కోసం ప్ర‌త్యేకంగా ఓ బిల్డింగ్ సెట్ ని కూడా నిర్మించారు. అందులోనే ఎడిట్ సూట్ తో పాటు ఇత‌ర టెక్నిషియ‌న్ ల కోసం ఏర్పాట్లు చేశారు. అక్క‌డే ఎడిటింగ్ ని పూర్తి చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఈ మూవీ 60 దేశాల్లో రికార్డు స్థాయి స్క్రీన్ ల‌లో విడుద‌ల‌వుతోంది. ఐదు భాష‌ల్లో 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్ ల‌లో విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని రెమ్యున‌రేష‌న్ లు, ఇన్నేళ్ల ఇంట్రెస్ట్ ల‌తో క‌లిపి దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు.

ప్ర‌మోష‌న్స్ కోసం ఏకంగా ఇంత వ‌ర‌కు ఏ చిత్రానికి ఖ‌ర్చు చేయ‌ని స్థాయిలో 40 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ఓ రికార్డ్ గా చెప్పుకోవ‌చ్చు. ఇన్ని వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి హీరోలు రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ ఎంతెంత తీసుకున్నారంటే ఒక్కో హీరో 45 కోట్లు ఈ మూవీ కోసం ఛార్జ్ చేశార‌ట‌. ఇక డైరెక్ట‌ర్ ఆఫ్ ది షిప్ గా నిలిచిన రాజ‌మౌళి ఈ మూవీకి రెమ్యున‌రేష‌న్ కాకుండా లాభాల్లో సింహ భాగం తీసుకుంటున్నార‌ట‌.

ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ కావ‌డంతో వీఎఫ్ ఎక్స్ కోసం భారీగానే ఖ‌ర్చు చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ స్థాయి ప్ర‌త్యేక‌త‌ల‌తో భార‌తీయ చిత్రాల్లోనే క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో రూపొందిన ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేట‌ర్ల‌ని కేటాయించారు. వీకెండ్ వ‌ర‌కు `ఆర్ ఆర్ ఆర్‌` దే హ‌వా. టికెట్ ల కోసం భారీ డిమాండ్ నెల‌కొన్న నేప‌థ్యంలో అన్ని థియేట‌ర్ల‌లోనూ ఆర్ ఆర్ ఆర్ ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఆర్థ్ర రాత్రి 1 గంట టికెట్ లు రికార్డు స్థాయిలో 5000 ప‌ల‌క‌డం విశేషం.